భారత్‌తో వన్డే సిరీస్‌కు ముందు వెస్టిండీస్‌కు మరో ఎదురుదెబ్బ

న్యూఢిల్లీ: భారత్‌తో వన్డే సిరీస్ ఆరంభానికి ముందే పర్యాటక వెస్టిండీస్ జట్టుకి వరుసగా మరో ఎదురుదెబ్బ తగిలింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో విధ్వంసకర ఓపెనర్‌గా పేరు తెచ్చుకున్న ఎవిన్ లూయిస్ జట్టుకు అందుబాటులో ఉండటం లేదు. ఇప్పటికే క్రమశిక్షణ తప్పిన ఆ జట్టు కోచ్‌పై ఐసీసీ రెండు వన్డేల సస్పెన్షన్ వేటు వేయగా.. తాజాగా ఓపెనర్ ఎవిన్ లావిస్ వ్యక్తిగత కారణాలతో వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నట్లు క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) ప్రకటించింది.

వ్యక్తిగత కారణాలతో పర్యటనకు రాలేనని
వ్యక్తిగత కారణాలతో భారత పర్యటనకు రాలేనని బోర్డుకు చెప్పాడు. ‘క్రికెట్ వెస్టిండీస్' ఈ మధ్య ఇచ్చిన సెంట్రల్ కాంట్రాక్టును లూయిస్ తిరస్కరించాడు. క్రిస్‌గేల్, ఇతర స్టార్ క్రికెటర్ల మాదిరిగా ఎక్కువ అంతర్జాతీయ లీగుల్లో ఆడాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. క్రిస్‌గేల్, ఆండ్రీ రసెల్, డ్వేన్ బ్రావో తదితర హిట్లర్ల లేకపోవడంతో ఇప్పటికే బలహీనంగా కనిపిస్తున్న వెస్టిండీస్ వన్డే జట్టు.. తాజాగా ఎవిన్ లావిస్ కూడా దూరమవడంతో మరింత పేలవంగా మారింది.

లూయీస్‌కి భారత్ పిచ్‌లపై మంచి అవగాహన
ఇప్పటికే అఫ్గానిస్థాన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్న క్రిస్‌గేల్ భారత్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌కు అందుబాటులో ఉండనని ముందే చెప్పేశాడు. ఐపీఎల్ 2018 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన ఎవిన్ లూయీస్‌కి భారత్ పిచ్‌లపై మంచి అవగాహన ఉంది. మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడే నైజమున్న ఈ హిట్టర్ ఆరంభంలోనే ప్రత్యర్థి బౌలర్ల లయని దెబ్బతీయడంలో సిద్ధహస్తుడు.

పర్యటనకు వచ్చుంటే విండీస్‌కు లాభం
మంచి ప్రదర్శన చేశాడు. విండీస్ తరఫున 35 వన్డేల్లో రెండు శతకాలు చేసిన అతడు 17 టీ20ల్లోనే రెండు శతకాలు చేయడం విశేషం. అతడు భారత పర్యటనకు వచ్చుంటే విండీస్‌కు లాభం చేకూరేది. జూలై 9, 2017న భారత్‌తో జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లో కేవలం 62 బంతుల్లోనే 6ఫోర్లు, 12సిక్సుల సాయంతో ఏకంగా 125 పరుగులతో ఎవిన్ లావిస్ అజేయంగా నిలిచాడు.

క్రిస్‌గేల్‌కి జట్టులో ప్రత్యామ్నాయంగా లూయీస్
దీంతో.. భారత్ నిర్దేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని మరో 9 బంతులు మిగిలి ఉండగానే వెస్టిండీస్ ఛేదించేసింది. ఏడాదికాలంగా ఓపెనర్ క్రిస్‌గేల్‌కి జట్టులో ప్రత్యామ్నాయంగా లూయీస్ కనిపించాడు. కానీ, ప్రస్తుత సిరీస్‌కు అందుబాటులో ఉండకపోవడంతో అతడి స్థానంలో వన్డేల్లో కీరన్ పావెల్, టీ20ల్లో నికోలస్ పూరన్‌కు అవకాశం ఇచ్చారు. అరంగేట్రం చేయని ఓబెడ్ మెక్‌కోయ్ పేరును వన్డే, టీ20 జట్ల జాబితాలో చేర్చారు. ఈనెల 21 నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య ఐదు వన్డేల సిరీస్ మొదలుకానుంది.

పరిమిత ఓవర్లలో ఆడనున్న వెస్టిండీస్ జట్లు:
వన్డే జట్టు: హోల్డర్(కెప్టెన్), ఆంబ్రిస్, బిషూ, హేమ్రాజ్, హెట్మెయర్, హోప్, మెక్‌కాయ్, నర్స్, పాల్, పావెల్, రొవ్‌మెన్ పావెల్, రోచ్, శామ్యూల్స్, థామస్.
టీ20 జట్టు: బ్రాత్‌వైట్(కెప్టెన్), ప్యాబియన్ అలెన్, డారెన్ బ్రావో, హెట్మెయర్, మెక్‌కాయ్, నర్స్, పాల్, పియరీ, పొలార్డ్, పూరన్, రొవ్‌మెన్ పావెల్, రామ్‌దిన్, రస్సెల్, రూథర్‌ఫోర్డ్, థామస్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications