Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వేదికలు ఖరారు: ఐసీసీ వరల్డ్ టీ20కి తొలిసారి ఆతిథ్యమిస్తోన్న విండిస్

Windies to host first-ever lone ICC Women's World T20 2018, venues announced

హైదరాబాద్: ఈ ఏడాది నవంబర్ 9 నుంచి 24 వరకు జరిగే మహిళల వరల్డ్ కప్‌కు వెస్టిండిస్ ఆతిథ్యమిస్తోంది. వెస్టిండిస్‌లోని ఆంటిగ్వా, బార్బడా, సెయింట్ లూసికాలు ఈ వరల్డ్ కప్‌కు ఆతిథ్యమిస్తున్న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం అధికారిక ప్రకటన చేసింది.

బిడ్డింగ్ ప్రాసెస్‌లో క్రికెట్ వెస్టిండిస్ మహిళల వరల్డ్ కప్ కోసం మొత్తం మూడు వేదికలను ఎంపిక చేసింది. ప్రిమిలినరీ రౌండ్ మ్యాచ్‌లకు గాను సెయింటి లూసికాలోని గుయానా నేషనల్ స్టేడియంతో పాటు డారెన్ సమీ స్టేడియం ఆతిథ్యమివ్వనున్నాయి.

ఇక, ఆంటిగ్వాలోని సర్ వివ్ రిచర్డ్స్ స్టేడియంలో రెండు సెమీ ఫైనల్స్ మ్యాచ్‌లు జరగనుండగా, ఫైనల్‌కు బార్బడా స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. మహిళల వరల్డ్ కప్ టోర్నీకి ఇప్పటికే ఆతిథ్య వెస్టిండిస్‌తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక దేశాలు అర్హత సాధించాయి.

మొత్తం తొమ్మిది దేశాలు పాల్గొనే ఈ టోర్నీలో ఇప్పటికే ఏడు దేశాలు అర్హత సాధించాయి. మిగతా రెండు స్ధానాల కోసం బంగ్లాదేశ్, హాలెండ్, ఐర్లాండ్, పాపువా న్యూ గునియా, స్కాట్లాండ్, థాయిలాండ్, ఉంగాండా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

నవంబర్‌లో జరిగే ఈ మహిళల వరల్డ్ కప్ టోర్నీకి వెస్టిండిస్ తొలిసారి ఆతిథ్యమిస్తోంది. కాగా, 2016లో కోల్‌కతా వేదికగా జరిగిన మహిళళ వరల్డ్ కప్ టోర్నీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై వెస్టిండిస్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ జట్టు కెప్టెన్ టేలర్ 2017 సంవత్సరానికి గాను ఐసీసీ ఉమెన్ టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, January 23, 2018, 13:30 [IST]
Other articles published on Jan 23, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+