ఫోటోలు: అశ్విన్ సిక్స్‌తో మ్యాచ్‌కి ముగింపు ఇలా
హైదరాబాద్: టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను చిత్తుచేసిన టీమిండియా తొలి వన్డేలో ఇంగ్లాండ్‌పై సంచలన విజయాన్ని నమోదు చేసింది. 351 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సహచర క్రికెటర్లు విఫలమైన చోట కోహ్లీ, కేదార్ జాదవ్‌లు అద్భుతమైన సెంచరీలతో విజృంభించి జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించారు.
ఆదివారం పూణెలో జరిగిన తొలి వన్డేలో 3 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కోహ్లీ తొలి వన్డేలోనే జట్టుకు శుభారంభాన్నిచ్చాడు.
అంతేకాదు ఇంగ్లాండ్‌తో జరిగిన తొల వన్డేలో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి, తన కెరీర్‌లో 27వ సెంచరీ సాధించాడు. మరో సెంచరీ హీరో, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కేదార్ జాదవ్‌తో కలిసి అతను ఐదో వికెట్‌కు 200 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి, భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

టాస్ గెలిచిన కోహ్లీ
టాస్ గెలిచిన కెప్టెన్ కోహ్లీని ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ని కొనసాగించిన జాసన్ రాయ్, అలెక్స్ హాలెస్ మొదటి వికెట్‌కు 39 పరుగులు జోడించారు. హాలెస్ 18 బంతులు ఎదుర్కొని, తొమ్మిది పరుగులు చేసి రనౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. దీంతో ఇంగ్లాండ్ మొదటి వికెట్ కోల్పోయింది. అయితే, ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన జో రూట్‌తో కలిసి జాసన్ రాయ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.

తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరిన ఇంగ్లాండ్ ఓపెనర్లు
61 బంతులు ఎదుర్కొని, 12 ఫోర్లతో 73 పరుగులు చేసిన అతనిని వికెట్‌కీపర్ ధోనీ క్యాచ్ అందుకోగా రవీంద్ర జడేజా అవుట్ చేశాడు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (28), జొస్ బట్లర్ (31) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. ధోనీ క్యాచ్ పట్టగా మోర్గాన్‌ను హార్దిక్ పాండ్యా వెనక్కు పంపాడు. బట్లర్ కూడా అతని బౌలింగ్‌లోనే శిఖర్ ధావన్‌కు క్యాచ్ ఇచ్చాడు. కాగా, 95 బంతుల్లో 78 పరుగులు సాధించిన జో రూట్‌ను జస్‌ప్రీత్ బుమ్రా అవుట్ చేశాడు.

ఇంగ్లాండ్‌కు కలిసొచ్చిన బెన్ స్టోక్స్ విజృంభణ
నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో రాణించిన అతను హార్దిక్ పాండ్య చక్కటి క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. చివరిలో బెన్ స్టోక్స్ విజృంభణ ఇంగ్లాండ్‌కు కలిసొచ్చింది. భారత బౌలింగ్‌పై విరుచుకుపడిన అతను 40 బంతుల్లోనే 62 పరుగులు చేసి, జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఉమేష్ యాదవ్ క్యాచ్ అందుకోగా అవుటయ్యాడు. అలీ 28 పరుగులు చేసి, ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌కాగా, క్రిస్ వోక్స్ (9), డేవిడ్ విల్లే (10) నాటౌట్‌గా నిలిచారు.

ఆఖరి పది ఓవర్లలో ఏకంగా 115 పరుగులు
దీంతో ఆఖరి పది ఓవర్లలో ఏకంగా 115 పరుగులు స్కోరుబోర్డుకు జతకలిశాయి. తన ఇన్నింగ్స్‌లో 2ఫోర్లు, 5 సిక్స్‌లతో 33 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. మొయిన్ అలీ(28)తో జతగా ఆరో వికెట్‌కు 5.3 ఓవర్లలోనే 73 పరుగులు జోడించడంతో స్కోరు 350లకు చేరుకుంది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్య, జస్‌ప్రీత్ బుమ్రా చెరి రెండు వికెట్లు తీసుకున్నారు.

భారత్ విజయ లక్ష్యం 351
351 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆదిలోనే తడబడింది. గాయం నుంచి కోలుకొని జట్టులోకొచ్చిన ఓపెనర్లు ధవన్, రాహుల్ తీవ్రంగా నిరాశపరిచారు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీతోపాటు రీ ఎంట్రీ స్టార్ యువరాజ్ సింగ్ కూడా సిక్సర్‌తో పరుగుల వేట ఆరంభించడంతో స్టేడియం మార్మోగింది. ఆ తర్వాత వరుస ఓవర్లలో యువరాజ్ సింగ్, ధోని కూడా పెవిలియన్ చేరడంతో టీమిండియా 63 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది.

కేదార్ జాదవ్, కోహ్లీ అద్భుత సెంచరీలు
ఈ దశలో క్రీజులోకి వచ్చిన కేదార్ జాదవ్, కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. దీంతో వీరిద్దరి జోడి 30 ఓవర్లకు గాను రెండొందల మార్కుని దాటించారు. కోహ్లీతో పోటా పోటీగా ఆడాడు. కేదార్‌తో పోటీ పడ్డ కోహ్లీ వోక్స్ బౌలింగ్‌లో మిడాన్ మీదుగా సిక్సర్ కొట్టి సెంచరీ (93 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. ఇక, 36వ ఓవర్లో బౌండ్రీతో జాదవ్ 65 బంతుల్లోనే శతక మార్కు చేరాడు.

స్టోక్స్ బౌలింగ్‌లో కోహ్లీ అవుట్
అయితే, స్టోక్స్ బౌలింగ్‌లో మరో భారీషాట్ ఆడబోయిన కోహ్లీ అవుటయ్యాడు. ఇదే సమయంలో కేదార్ కాలు కండరాలు పట్టేశాయి. నొప్పితో రన్నింగ్ చేయలేకపోయాడు. దీంతో జాక్ బాల్ బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. స్టోక్స్ బౌలింగ్‌లో బౌండ్రీ కొట్టిన అతను 40వ ఓవర్లో పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో భారత్ స్కోరు 5 వికెట్ల నష్టానికి 291 పరుగులతో భారత పటిష్ట స్థితిలో నిలిచింది.

సిక్సర్‌తో మ్యాచ్‌కు ముగింపు పలికిన అశ్విన్
యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (40 నాటౌట్) వారి ఆశలపై నీళ్లు చల్లాడు. మరో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (13) పెవిలియన్ చేరినా భారత్‌కు విజయాన్నందించాడు. రషీద్ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో పాండ్యా స్కోరు సమం చేయగా.. అశ్విన్ (15 నాటౌట్) సిక్సర్‌తో మ్యాచ్‌కు ముగింపు పలికాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications