Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చెడ్డోడేం కాదు: వార్నర్‌కు మద్ధతుగా నిలిచిన సన్‌రైజర్స్ కొత్త కెప్టెన్

Williamson: Warner isnt a bad person

హైదరాబాద్: ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు మద్ధతుగా న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ నిలిచాడు. ఇంతకుముందు జరిగిన ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టుకు వార్నర్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. దీంతో అప్పటి నుంచి వార్నర్ తనకు తెలుసని, తప్పు చేసుండొచ్చు.. కానీ, చెడ్డ వ్డక్తి కాదని తెలిపాడు. మోసం చేశారంటూ క్రికెట్ ఫ్యాన్స్ వార్నర్, స్మిత్‌లను తిడుతున్న తరుణంలో కేన్.. తన సహచరుడికి అండగా నిలవడం గమనార్హం.

బాల్ ట్యాంపరింగ్ ఘటన జరిగిన వెలుగులోకి వచ్చినప్పటి నుంచి వార్నర్‌తో టచ్‌లో ఉన్నానని కివీస్ కెప్టెన్ తెలిపాడు. 'ఇది నిజంగా సిగ్గుచేటు. ఈ చర్యను ఏ జట్టూ సమర్థించదు. కానీ వార్నర్ చెడ్డోడేమీ కాదు. అతడు తప్పు చేశాడు, దాన్ని ఒప్పుకున్నాడు. అలా చేసినందుకు వారు నిరాశ చెందారు.' అని విలియమ్సన్ తెలిపాడు.

బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా క్రికెట్ ఆస్ట్రేలియా కఠినంగా వ్యవహరించింది. వార్నర్, స్మిత్‌లు ఏడాదిపాటు దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ)నిషేధించింది. మరొకవైపు బౌలర్‌ బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలలపాటు వేటు వేసింది.

స్మిత్, బాన్‌క్రాఫ్ట్‌లను నిషేధం ముగిసిన ఏడాది దాకా కెప్టెన్సీకి పరిగణనలోకి తీసుకోమని తేల్చి చెప్పింది. వార్నర్‌ను జీవితాంతం ఎలాంటి నాయకత్వ బాధ్యతలకు పరిగణనలోకి తీసుకోబోమని సీఏ తేల్చిచెప్పింది.

Story first published: Thursday, March 29, 2018, 14:42 [IST]
Other articles published on Mar 29, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+