కివీస్ కేప్టెన్‌కు బ్రిటీష్ మీడియా అరుదైన గౌరవం: స్టాండింగ్ ఒవేషన్‌తో!

లండన్: క్రికెట్ మ్యాచ్‌ల సందర్భంగా స్టాండింగ్ ఒవేషన్ అనేది తరచూ వినిపించే పదం..కనిపించే దృశ్యం. ఏ ఆటగాడైనా మ్యాచ్ మలుపు తిప్పేలా సెంచరీ చేసినా, వికెట్లు తీసుకున్నా, లేక రికార్డులను బద్దలు కొట్టేలా స్కోరు సాధించినా.. స్టాండ్స్‌లో ఉన్న ప్రేక్షకులు స్టాండింగ్ ఒవేషన్ ఇస్తుంటారు. క్రికెట్ వరకూ తీసుకుంటే- ఆ ఆటగాడికి ప్రేక్షకులు ఇచ్చే అత్యుత్తమ గౌరవం ఇది. ఇందులో సందేహాలు అనవసరం. ప్రేక్షకులు లేచి నిలబడి, చప్పట్లు కొడుతూ సదరు క్రికెటర్‌ను ప్రశంసించడం అంటే మాటలు కాదు. అలాంటి అరుదైన గౌరవాన్ని బ్రిటీష్ మీడియా నుంచి అందుకున్నాడు న్యూజిలాండ్ కేప్టెన్ కేన్ విలియమ్సన్. మ్యాచ్ ముగిసిన అనంతరం లార్డ్స్ స్టేడియంలోని ప్రెస్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం అనంతరం ఈ సన్నివేశం ఆవిష్కృతమైంది.

ఇంగ్లండ్‌ను గెలవనిస్తేగా..
ప్రపంచకప్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు చివరి బంతి వరకూ పోరాడింది. ఓటమి పలకరిస్తున్నా పట్టించుకోలేదు. గెలుపు కోసం చివరి బంతి వరకు, చివరి నిమిషం వరకూ తపించింది. ఇంగ్లండ్ జట్టును సొంతగడ్డపై పరాజయం అంచుల దాకా తీసుకెళ్లింది. చివరికి- దురదృష్టం వెంటాడటంతో ఓటమిని చవి చూసింది కివీస్ టీమ్. ఫైనల్ మ్యాచ్‌లో తక్కువ స్కోరు చేసినప్పటికీ.. ఇంగ్లండ్ జట్టుకు చుక్కలు చూపించారు న్యూజిలాండర్లు. వరుసగా వికెట్లను పడగొడుతూ వెన్నులో వణుకు పుట్టించారు. మ్యాచ్‌ను సూపర్ ఓవర్ వరకూ తీసుకెళ్లగలిగారు. సూపర్ ఓవర్‌ను సైతం టైగా ముగించడం ప్రపంచకప్ టోర్నమెంట్‌లోనే కాదు.. ప్రపంచ క్రికెట్‌లోనే అత్యద్భుతం. టైగా ముగిసిన ఈ మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం.. ఇంగ్లండ్‌ను గెలిచినట్లు ప్రకటించారు.
ఇంగ్లండ్‌కు ఆ అర్హత ఉంది
ప్రపంచకప్‌ను గెలిచే అర్హత ఇంగ్లండ్ జట్టుకు ఉందని కేప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నారు. మ్యాచ్ ముగిసిన అనంతరం లార్డ్స్ స్టేడియంలోని ప్రెస్ గ్యాలరీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇంగ్లండ్ అద్భుతంగా పోరాడిందని, ప్రపంచకప్ విజేతగా ఆవిర్భవించే అర్హత ఇవాన్ మోర్గాన్ టీమ్‌కు ఉందని ప్రశంసించారు. ఇంగ్లండ్ క్రికెటర్లు పట్టుదలతో పోరాడారని కితాబిచ్చారు. ఓటమి తమను తీవ్రంగా బాధించిందని, జట్టులోని ఏ ఒక్కరూ ఈ దిగ్భ్రాంతికర ఓటమి నుంచి ఇప్పట్లో తేరుకోలేరని చెప్పుకొచ్చారు. తమ జట్టు అద్భుతంగా రాణించిందని, ఇందులో తన పాత్ర ఏమీ లేదని అన్నారు కేన్ విలియమ్సన్.

ఎవ్వర్నీ తప్పుపట్టలేం
జట్టు ఓటమిలో ఎవ్వర్నీ తప్పుపట్టలేమని కేన్ అన్నారు. నిబంధనలు ఎలా ఉన్నాయో తనకు తెలియవని, అందుకే- వాటిని అడ్డు పెట్టుకుని తాను ఐసీసీని గానీ, ఇంకెవర్ని గానీ విమర్శించలేమని చెప్పారు. బౌండరీల ద్వారా విజేతను ప్రకటిస్తారనే విషయం తనకు ఇప్పటిదాకా తనకు తెలియదని చెప్పుకొచ్చారు. తమ ఫీల్డర్ విసిరన త్రోకు బెన్‌స్టోక్స్ బ్యాట్ తగిలి బంతి బౌండరీకి వెళ్లడం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. తమ జట్టును దురదృష్టం వెంటాడిందని, అందువల్లే ఇలాంటి అనూహ్య సంఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పారు. ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా బ్రిటీష్ మీడియా అడిగిన పలు ప్రశ్నలకు కేన్ విలియమ్సన్ చిరునవ్వుతో సమాధానం ఇచ్చారు. ఇది వారిని అమితంగా ఆకట్టుకుంది. ప్రెస్ కాన్ఫరెన్స్ ముగిసిన అనంతరం విలేకరులు, బ్రిటీష్ మీడియా ప్రతినిధులు విలియమ్సన్‌కు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ప్రతి ఒక్కరు నిలబడి చప్పట్లు కొడుతూ, కేన్ విలియమ్సన్‌ను అభినందించారు.
{headtohead_cricket_2_4}
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications