చాలా అందంగా ఉన్నావ్.. పెళ్లి చేసుకుంటావా అని వేడుకున్న తెవాటియా! అసలు ట్విస్ట్ ఏంటంటే?

హైదరాబాద్: సజావుగా సాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021ను కరోనా వైరస్ మహమ్మారి దారుణంగా దెబ్బతీసింది. టోర్నీలో కరోనా కేసులు పెరగడంతో గత మంగ‌ళ‌వారం అనూహ్య ప‌రిస్థితుల్లో భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) ఐపీఎల్ 2021ను నిరవధిక వాయిదా వేసింది.

దీంతో ప్లేయర్స్ అందరూ ఇళ్లకు చేరుకొని ఐసొలేషన్‌లో ఉంటున్నారు. ఇక పలు ఫ్రాంఛైజీలు సోషల్‌ మీడియా వేదికగా తమ ఆటగాళ్ల వీడియోలు పోస్ట్‌ చేస్తూ అభిమానుల్లో ఆనందం పంచుతున్నాయి. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే రాజస్తాన్‌ రాయల్స్‌ ప్రాంఛైజ్ పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అయింది.

రాజస్థాన్ ఆటగాళ్ల సరదా గేమ్

రాజస్థాన్ ఆటగాళ్ల సరదా గేమ్

తాజాగా రాజస్తాన్‌ రాయల్స్‌ ప్రాంఛైజ్ తమ జట్టు ఆటగాళ్లకు సంబందించిన ఓ ఫన్నీ వీడియో థన్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. బయో బబుల్‌లో ఉన్న రాజస్థాన్ ఆటగాళ్లు మ్యాచుల మధ్యలో ఓ గేమ్‌ (మ్యూజికల్ చైర్) ఆడారు. ఈ గేమ్‌లో ప్లేయర్స్, కోచింగ్ సిబ్బందితో సహా వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. బెంచ్‌కు ఇరు వైపులా కూర్చొని ఓ చిన్నపాటి దిండుతో రాయల్స్ ఆటగాళ్లు మ్యూజికల్ చైర్ గేమ్ ఆడారు. ఆటలో భాగంగా మ్యూజిక్‌ ఆగిపోయినపుడు.. దిండు ఎవరి చేతిలో ఉంటుందో వాళ్లు ఓ చిట్టీ తెరచి అందులో ఏముంటే అది చేయాలి.

ఐ లవ్‌ యూ

దిండును మొదటగా జోస్ బట్లర్ అందుకుని అటుగా విసిరాడు. అలా రాహుల్ తెవాటియా దగ్గరకు వచ్చేసరికి మ్యూజిక్‌ ఆగిపోయింది. మొదటగా నేను కాదు అంటూ తెవాటియా మొండికేసినా.. మిగతావారు ఊరుకోలేదు. దీంతో చిట్టీ తెరచి టాస్క్‌ చేయాల్సి వచ్చింది. నీళ్ల బాటిల్‌కు ప్రపోజ్‌ చేయాలని చిట్టీలో ఉండటంతో.. మెల్లగా బాటిల్‌ తీసుకున్న అతడు ముసిముసిగా నవ్వుతూ సీనియర్ల సలహాలతో రెచ్చిపోయాడు.

'నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఐ లవ్‌ యూ.. నన్ను పెళ్లి చేసుకుంటావా?' అని సిగ్గుపడుతూ తెవాటియా ప్రపోజల్‌ చేశాడు. దీంతో అక్కడున్న వారందరూ నవ్వులు పూయించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫాన్స్ కూడా తమదైన శైలిలో జోకులు పేల్చుతున్నారు.

మోస్తరు ప్రదర్శనే

మోస్తరు ప్రదర్శనే

ఐపీఎల్ 2021లో రాహుల్ తివాటియా మోస్తరు ప్రదర్శనే పరిమితమయ్యాడు. 14వ ఎడిషన్‌లో 5 ఇన్నింగ్స్‌లలో కేవలం 17.20 సగటుతో 86 పరుగులు మాత్రమే చేశాడు. బంతితో కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. టోర్నీ మొత్తంలో కేవలం 2 వికెట్లే పడగొట్టాడు. ఐపీఎల్ 2020లో తివాటియా స్టార్ అయిన విషయం తెలిసిందే. షెల్డన్ కాట్రెల్‌ వేసిన ఓ ఓవర్‌లో 5 సిక్సర్లు బాది వెలుగులోకి వచ్చాడు. ఐపీఎల్‌లో తివాటియా 41 మ్యాచ్‌లు ఆడి 26.59 సగటుతో 452 పరుగులు చేశాడు. జూలైలో శ్రీలంకతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు తివాటియా ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి.

WTC Finals: భువనేశ్వర్‌ కుమార్‌పై వేటు అందుకేనా.. ఇక భువీ టెస్ట్ కెరీర్‌ ముగినట్టేనా?

సెల్ఫీ దిగుతున్నట్లు పోజులు

సెల్ఫీ దిగుతున్నట్లు పోజులు

కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో రాజస్తాన్‌ జట్టు యువ ఆటగాళ్లైన రియాన్‌ పరాగ్‌, రాహుల్‌ తెవాటియాలు మైదానంలో తమ చర్యలతో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారారు. ఈ ఇద్దరు క్రికెట్‌లో కొత్త తరహా సెల్రబ్రేషన్స్‌కి తెరదీశారు. క్యాచ్ పట్టగానే ఆ పక్కనే ఫీల్డింగ్ చేస్తున్న రాహుల్‌ని పిలవడం.. అతను తనని సమీపిస్తున్న సమయంలో ఓ మొబైల్ ఫోన్‌ని జేబులో నుంచి తీసి తెవాటియాకి విసురుతున్నట్లు రియాన్ యాక్షన్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి బంతితో సెల్ఫీ దిగుతున్నట్లు మైదానంలో పోజులిచ్చారు. ఇది అప్పుడు వైరల్ అయింది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, May 12, 2021, 15:18 [IST]
Other articles published on May 12, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X