Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధావన్‌కు భార్య వచ్చిన వేళ: విరాట్ కోహ్లీకి ప్రేయసి దొరికన వేళ

మెల్బోర్న్: ప్రపంచకప్ వన్డే మ్యాచులో పాకిస్తాన్‌పై విరాట్ కోహ్లీ సెంచరీ చేసినందుకు ఆయన ప్రేయసి అనుష్క శర్మ అభినందనలు అందుకుంది. కోహ్లీ సెంచరీ చేసినందుకు క్రికెట్ అభిమానులు అనుష్క శర్మను ప్రశంసలతో ముంచెత్తారు. తాజాగా శిఖర్ ధావన్ దక్షిణాఫ్రికాపై సెంచరీ చేసి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో క్రికెట్ అభిమానులు ఆయన భార్య అయేషా ముఖర్జీని ప్రశంసలతో ముంచెత్తారు. విరాట్ కోహ్లీకి ప్రేయసి దొరికిన వేళ, శిఖర్ ధావన్‌కు భార్య వచ్చిన వేళ అనేది ఓ నానుడిలా మారింది.

క్రికెటర్‌గా శిఖర్ ధావన్ విజయం వెనుక భార్య ఆయేషా ముఖర్జీ ఉందనే భావన నాటుకుపోతోంది. ఆమెను పెళ్లాడిన తర్వాతనే ధావన్ దశ తిరగడం ప్రారంభమైంది. నిజానికి, అయేషా, ధావన్ చాలా గమ్మత్తుగా కలుసుకున్నారు. ఫేస్‌బుక్ ద్వారానే ఆయేషాతో ధావన్ తొలి పరిచయం ఏర్పడింది. విల్ యూ బి మై ఫేస్‌బుక్ ఫ్రెండ్! అంటూ సహ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఫ్రెండ్స్‌లిస్ట్‌లో ఉన్న ఆయేషాకు ధవన్ రిక్వెస్ట్ పంపాడట.

Will You be My Facebook Friend? This is How Shikhar Dhawan Met his Wife

అలా ఫేస్‌బుక్ ద్వారా ప్రేమ చిగురుంచి, వికసించింది. 2009లో వివాహనిశ్చితార్థం జరిగింది. 2012లో పెళ్లి జరిగింది. బ్రిటీష్ సంతతికి చెందిన ఆయేషా 29 ఏండ్ల ధావన్‌కన్నా పదేళ్లు పెద్దది. ధావన్‌తో పెళ్లయ్యేనాటికి ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. ఇప్పుడు వారిద్దరికీ ఓ బాబు ఉన్నాడు. అతని పేరు జొరావర్ ధవన్. ధావన్‌కు మాదిరిగానే అయేషాకు పచ్చబొట్టు అంటే మహా పిచ్చి.

బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో, ఆ తర్వాత ముక్కోణపు సిరీస్‌లో ఘోరంగా విఫలమైన శిఖర్ ధావన్ పాకిస్థాన్‌పై 73 పరుగులు, దక్షిణాఫ్రికాపై 137 పరుగులు చేసి సత్తా చాటాడు. తాను ఆడుతున్న తొలి వరల్డ్‌కప్‌లోనే సెంచరీ కొట్టడం గొప్పగా ఉందని ధావన్ మురిసిపోయాడు. ఇంతకన్నా వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికాపై తొలిసారిగా గెలుపొందడం మరింత ఆనందాన్నిచ్చిందని అంటున్నాడు. మొత్తంగా మళ్లీ ఫామ్‌లోకి రావడం సంతోషంగా ఉందని, ఈ సమయం కోసం మూణ్నెళ్లుగా ఎదురుచూస్తున్నానని ధావన్ అన్నాడు. విఫలమైన ప్రతీ సందర్భంలో మంచిరోజులొస్తాయని ఆశించానే తప్ప, భయపడలేదని అన్నాడు. ఇలా మానసికంగా ప్రశాంత చిత్తంతో ఉండడం తనకు కలిసిచ్చిందని చెబుతున్నాడు.

దక్షిణాఫ్రికాపై చరిత్రాత్మక విజయంలో సెంచరీతో కీలక పాత్ర పోషించిన ధావన్ ఇప్పుడు ట్విట్టర్లో హాట్ టాపిక్. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ తర్వాత ట్విట్టర్లో చర్చంతా ధావన్ గురించే జరుగుతోంది. ఫీల్డింగ్ సెట్ చేయడంలో అద్భుత ప్రతిభ కనబరిచిన ధోనీ, దూకుడైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న రహానే ధావన్ తర్వాతి స్థానాలను ఆక్రమించారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+