Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఈసారి బుద్దిగా ఉంటా.. మరో ఛాన్స్‌ ఫ్లీజ్‌: సంజయ్‌ మంజ్రేకర్‌

Will work as per guidelines: Sanjay Manjrekar requests BCCI to reinstate him in commentary panel for IPL 2020

ముంబై: టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ ఎట్టకేలకి వెనక్కి తగ్గాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (ఐపీఎల్)‌ 2020కి తనను వ్యాఖ్యాతగా తీసుకోవాలని కోరుతూ‌ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి మంజ్రేకర్‌ ఈమెయిల్‌ పంపించారని సమాచారం తెలిసింది. టీవీ వ్యాఖ్యాతల నిబంధనావళి ప్రకారమే నడుచుకుంటానని, తనకు మరో అవకాశం ఇవ్వాలని మంజ్రేకర్‌ విజ్ఞప్తి చేశారట. మరి బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

వివాదాస్పద పదాలు జోడించడంతో

వివాదాస్పద పదాలు జోడించడంతో

సంజయ్‌ మంజ్రేకర్‌కు మంచి క్రికెట్‌ పరిజ్ఞానం ఉంది. అంతకుమించి ఇంగ్లీష్ భాషలో గలగలా మాట్లాడుతూ అద్భుతంగా కామెంటరీ చేయగలడు. అయితే ఆ కామెంటరీకి కొన్ని సందర్భాల్లో వివాదాస్పద పదాలు జోడించడంతో.. మంజ్రేకర్‌ వివాదంలో చిక్కుకున్నాడు. గతంలోనూ ఐపీఎల్ సమయంలో ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్‌‌ని 'మతిలేని క్రికెటర్' అంటూ సెటైర్ వేశాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో 'బిట్స్‌ అండ్‌ పీసెస్‌' అంటూ చేసిన వ్యాఖ్యలకు టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా తీవ్రంగా బదులిచ్చాడు. ఇక సహచర కామెంటేటర్ హర్షా భోగ్లాని హేళన చేస్తూ మాట్లాడినప్పుడు సోషల్‌ మీడియాలో పెద్ద దుమారం చెలరేగింది. దీంతో గత మార్చిలో దక్షిణాఫ్రికా సిరీస్ సమయంలో మంజ్రేకర్‌పై బీసీసీఐ వేటు వేసింది.

నేను ఎవరినీ నొప్పించాలనుకోలేదు

నేను ఎవరినీ నొప్పించాలనుకోలేదు

బీసీసీఐ తనని కామెంట్రీ ప్యానెల్ నుంచి తప్పిండంపై సంజయ్‌ మంజ్రేకర్ గతంలో మాట్లాడుతూ... 'నేను ఎవరినీ నొప్పించాలనుకోలేదు. ఎందుకంటే నా హద్దులు నాకు తెలుసు. అందుకే ఇన్నేళ్లు కామెంటేటర్‌గా కొనసాగాను. లేకుంటే ఐదేళ్ల ముందే నా కామెంటేటర్ కెరీర్ ముగిసిపోయేది. కామెంట్రీ బాక్స్‌లో బాధ్యతగా వ్యవహరించా. ఎప్పుడూ హద్దులు మీరలేదు' అని వివరణ ఇచ్చుకున్నాడు. అయితే బీసీసీఐ మాత్రం స్పందించలేదు. ఇక ఐపీఎల్ 2020కి త్వరలో కామెంట్రీ ఫ్యానల్‌ని బీసీసీఐ ప్రకటించబోతోంది. దీంతో ఆ ఫ్యానల్‌లోకి తనని తీసుకోవాలని అభ్యర్థిస్తూ మంజ్రేకర్ తాజాగా బీసీసీఐకి లేఖ రాశాడు.

నిబంధనావళి ప్రకారమే నడుచుకుంటా

నిబంధనావళి ప్రకారమే నడుచుకుంటా

'బీసీసీఐ సర్వోన్నత మండలి సభ్యులు అందరూ బాగున్నారని భావిస్తున్నా. వ్యాఖ్యాతగా నా స్థానం గురించి పంపించిన ఈమెయిల్‌ను మీరు ఇప్పటికే అందుకొని ఉంటారు. ఐపీఎల్‌ తేదీలు ప్రకటించడంతో బీసీసీఐ బోర్డు త్వరలోనే కామెంట్రీ ఫ్యానల్‌ని ఎంచుకోనుంది. మీరు పేర్కొన్న నిబంధనావళిని పాటిస్తూ పనిచేయడం నాకు సంతోషమే. నా వినతిని పరిగణనలోకి తీసుకుంటారని భావిస్తున్నా. అందరికి ధన్యవాదాలు' అని మంజ్రేకర్‌ ఈమెయిల్‌ రాశారని సమాచారం.

ఈ వివాదాన్ని ముగించాలనుకుంటున్నాం

ఈ వివాదాన్ని ముగించాలనుకుంటున్నాం

'సంజయ్‌ మంజ్రేకర్‌ను క్షమించేసి ఈ వివాదాన్ని ముగించాలనుకుంటున్నాం. రవీంద్ర జడేజాపై చేసిన వ్యాఖ్యలకు ఆయన ఇప్పటికే క్షమాపణలు కోరాడు. అతడిని స్వయంగా కలిశాడు. కామెంట్రీ ఫ్యానల్ నిబంధనావళికి అనుగుణంగా పనిచేస్తానని మంజ్రేకర్‌ మాటిచ్చాడు. అతడికి క్రికెట్‌పై అపారమైన పరిజ్ఞానం ఉన్న సంగతి వాస్తమే' అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి మీడియాతో అన్నారు. అయితే తుది నిర్ణయం మాత్రం బీసీసీఐ బాస్ సౌరవ్‌ గంగూలీ, సెక్రటరీ జై షా తీసుకోనున్నారు.

పీఎస్‌ఎల్‌ కన్నా ఐపీఎల్‌ చాలా పెద్దది: వసీం అక్రమ్‌

Story first published: Friday, July 31, 2020, 16:42 [IST]
Other articles published on Jul 31, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+