ఐసీసీ ఆసక్తికర ట్వీట్: కోహ్లీసేన టీ20 వరల్డ్‌కప్‌ను గెలుచుకుంటుందా?

హైదరాబాద్: వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్‌కప్ ప్రచార కార్యక్రమాలను ఐసీసీ మొదలు పెట్టింది. ఇందులో భాగంగా 2007లో ధోని నాయకత్వంలోని టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది.
మీకోసం: ప్రో కబడ్డీ 7వ సీజన్ స్పెషల్ సైట్
కాగా, 2020లో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌కి ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్‌లో భారత్ గెలుస్తుందా? అనే ప్రశ్నతో ఐసీసీ ట్వీట్‌ను పోస్టు చేయడం విశేషం. అంతేకాదు వచ్చే ఏడాది జరగనున్న వరల్డ్ కప్ టిక్కెట్ అమ్మకాల కోసం ఇప్పటి నుంచే ప్రచారం మొదలు పెట్టింది.
టీ20 వరల్డ్‌కప్ టికెట్లు కావాలంటే రిజిష్టర్ చేసుకోండంటూ లింక్‌ను సైతం పోస్టు చేసింది. ధోని నాయకత్వంలోని టీమిండియా 2007లో జరిగిన టీ20 తొలి ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఇదిలా ఉంటే, ప్రపంచకప్ అనంతరం టీమిండియా వెస్టిండిస్ పర్యటనకు సిద్ధమైంది.
ఆగస్టు 3 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరిస్‌లో కోహ్లీసేన 3 వన్డేలు, 3 టీ20లు, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది. గత ఆదివారం ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలోని ఛీఫ్ సెలక్షన్ కమిటీని విండిస్ పర్యటనకు జట్టుని ప్రకటించిన సంగతి తెలిసిందే. టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని విండిస్ పర్యటనకు పలువురు యువ ఆటగాళ్లకు చోటు దక్కించుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications