Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వారిలాగే పెళ్లాయ్యాక కోహ్లీ కూడా కప్ తీసుకురాగలడా?

Will Virat Kohli bring world cup after marriage like them

అంతకు ముందు టీమిండియా కెప్టెన్లు పెళ్లి చేసుకున్న సంవత్సరం లేదా ఆ తర్వాతి సంవత్సరం జరిగిన ప్రపంచ కప్ సిరీస్ లలో భారత్ కు ప్రపంచ కప్ తీసుకొచ్చారు. మరి ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ తీసుకురాగలడా.. 2019 లో జరగనున్న ప్రపంచ కప్ గురించి ఇప్పుడు కోహ్లీ ఎలా సిద్ధమవుతాడో చూడాలి.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మలు ఈ నెల 11న ఇటలీలో వైభవంగా వివాహం చేసుకున్నారు. వివాహం కోసం శ్రీలంకతో జరుగనున్న వన్డే, టీ-20 సిరీస్‌లకు కోహ్లీ విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. మరి సెలవులు పూర్తయ్యాక పరిస్థితి ఏంటి.

కోహ్లీ దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ సిరీస్‌ నుంచి తిరిగి జట్టులో చేరనున్నాడు. కెప్టెన్‌గా విరాట్ ఎన్నో ప్రతిష్టాత్మక సిరీస్‌లలో జట్టు సహకారంతో విజయాన్ని తెచ్చి పెట్టాడు. అదే విధంగా 2019లో జరిగే ఐసీసీ ప్రపంచకప్‌ని కూడా కోహ్లీ సేన తమ ఖాతాలో వేసుకొనే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

గతంలో భారత్‌కు ప్రపంచకప్‌లు సాధించిన ఇద్దరు కెప్టెన్‌లు తమ వివాహం తర్వాత జరిగిన ప్రపంచకప్‌ టోర్నీలో భారత్‌ను గెలిపించారు. దీంతో కోహ్లీ కూడా సీనియర్‌ల దారిలోనే నడిచి 2019లో జరిగే ప్రపంచకప్‌ని తీసుకొస్తాడని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం జట్టు రీత్యానే గాక, వ్యక్తిగతంగా కూడా అందరూ బాగా రాణిస్తుండటంతో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.

టీమిండియా మాజీ సారధి కపిల్ దేవ్ అప్పట్లో కెప్టెన్ గా ఉండగానే 1980లో వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత 1983లో జరిగిన ప్రపంచకప్‌లో జట్టుని గెలిపించి.. భారత్‌కు తొలి ప్రపంచకప్‌ను అందించాడు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 2010లో కెప్టెన్‌గా ఉన్నప్పుడే వివాహం చేసుకొన్నాడు. 28 సంవత్సరాల తర్వాత 2011లో జరిగిన ఐసీసీ ప్రపంచకప్‌లో మరోసారి ప్రపంచకప్‌ని భారతదేశానికి అందించాడు.

అయితే, తాజాగా వివాహం చేసుకున్న విరాట్ కోహ్లీ కూడా 2019 వరల్డ్ కప్‌‌లో టీమిండియాను గెలిపించి మూడోసారి ప్రపంచకప్‌ని ఇండియాకు తీసుకొస్తాడని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, December 14, 2017, 18:22 [IST]
Other articles published on Dec 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+