Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఓవల్‌లో చివరి టెస్ట్.. శిష్యుడి కోసం గురువు వస్తాడా?

Virat Kohli: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరగనున్న చివరి, కీలక టెస్ట్ మ్యాచ్‌ను వీక్షించేందుకు విరాట్ కోహ్లీ వస్తాడా అనే విషయంపై క్రీడా ప్రపంచంలో ఉత్సుకత నెలకొంది. ప్రస్తుతం లండన్‌లో నివాసం ఉంటున్న కింగ్ కోహ్లీ.. ఇటీవలే వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు వచ్చాడు. దీనితో ఓవల్ మైదానంలో జరగనున్న ఈ మ్యాచ్‌ను కూడా చూడటానికి వస్తాడని అభిమానులు అంచనా వేస్తున్నారు.

భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదో టెస్ట్ మ్యాచ్ లండన్‌లోని ఓవల్ మైదానంలో నేడు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు తప్పనిసరిగా గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగనుంది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా తన మొదటి టెస్ట్ సిరీస్‌లో నాయకత్వం వహిస్తున్నందును.. సిరీస్‌ను ఎలాగైనా సమం చేయాలని తీవ్రంగా కృషి చేస్తున్నాడు. శుభ్‌మన్ గిల్ తన బ్యాటింగ్‌లో ఇప్పటికే 4 సెంచరీలు సహా 722 పరుగులు సాధించాడు. విరాట్ కోహ్లీ రిటైర్ అయిన తర్వాత నంబర్ 4 బ్యాటింగ్ స్థానంలో శుభ్‌మన్ గిల్ ఆడుతున్నాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఎంత దూకుడుగా, అద్భుతంగా ఆడాడో.. అదే తరహా ఆటను శుభ్‌మన్ గిల్ ప్రదర్శిస్తున్నాడు. రెండో టెస్ట్ విజయం తర్వాత విరాట్ కోహ్లీ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇదే విషయాన్ని ప్రస్తావించాడు.

Will Virat Kohli Attend the Final Test at The Oval to Support His Prot g Shubman Gill

శుభ్‌మన్ గిల్ విరాట్ కోహ్లీకి వీరాభిమాని కూడా. శుభ్‌మన్ గిల్‌ను భారత జట్టులోకి చాలా త్వరగా తీసుకొచ్చింది కూడా విరాట్ కోహ్లీనే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో తన శిష్యుడి కోసం విరాట్ కోహ్లీ చివరి టెస్ట్ మ్యాచ్‌ను చూడటానికి ప్రత్యక్షంగా వస్తాడా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటివరకు ఇంగ్లండ్ గడ్డపై భారత జట్టు 4 టెస్ట్ మ్యాచ్‌లు ఆడినప్పటికీ, విరాట్ కోహ్లీ ఒక్కసారి కూడా నేరుగా వచ్చి చూడలేదు.

వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ ను చూడటానికి వచ్చిన చాలా మంది భారత ఆటగాళ్లు భారత జట్టును కలిశారు. కానీ లండన్‌లోనే నివసిస్తున్న విరాట్ కోహ్లీ ఇప్పటివరకు భారత జట్టును గానీ, భారత ఆటగాళ్లను గానీ కలవలేదు. దీంతో చివరి టెస్ట్ మ్యాచ్‌కైనా విరాట్ కోహ్లీ వస్తాడా అనే ఆసక్తి నెలకొంది. విరాట్ కోహ్లీ వస్తే భారత జట్టు ఆటగాళ్లు మరింత ఉత్సాహం పొందుతారు. భారత ఆటగాళ్లకు ఉత్సాహాన్నిచ్చేలా విరాట్ కోహ్లీ దూకుడుగా ఒక స్పీచ్ ఇస్తే అది అభిమానులకు కూడా స్ఫూర్తినిస్తుందని భావిస్తున్నారు.

2021-22 ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ తర్వాత విరాట్ కోహ్లీ ఇంగ్లండ్‌లో స్థిరపడ్డాడు. అక్కడ సాధారణ వ్యక్తిలా రైళ్లలో ప్రయాణించడం, రోడ్లపై నడవడం తనకు ఆనందాన్ని ఇచ్చిందని విరాట్ కోహ్లీ చెప్పాడు. దీనితో భారతదేశానికి అత్యంత ముఖ్యమైన ఈ టెస్ట్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడటానికి విరాట్ కోహ్లీ వస్తాడని ఆశిస్తున్నారు.

Story first published: Thursday, July 31, 2025, 11:10 [IST]
Other articles published on Jul 31, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+