Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియాలోకి బుడ్డోడు.. 15 ఏళ్లకే సచిన్ రికార్డులపై నజర్!

భారత క్రికెట్ చరిత్రలో అప్పుడప్పుడు కొందరు ఆటగాళ్లు వయస్సుకు మించిన ప్రతిభతో దూసుకొస్తుంటారు. ప్రస్తుతం అలాంటి సంచలనమే సృష్టిస్తున్నాడు 15 ఏళ్ల యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ. అండర్-19 స్థాయిలో ఇప్పటికే తన బ్యాటింగ్ పవర్‌తో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించిన ఈ బీహార్ కుర్రాడు ఐపీఎల్‌లోనూ అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ నేపథ్యంలోనే వైభవ్ సూర్యవంశీని నేరుగా సీనియర్ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. అయితే ఇంత చిన్న వయసులో అంతర్జాతీయ ఒత్తిడిని వైభవ్ తట్టుకోగలడా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

సచిన్ టెండూల్కర్ రూట్.. బరూచా మాస్టర్ ప్లాన్
రాజస్థాన్ రాయల్స్ మాజీ డైరెక్టర్, వైభవ్ కు మెంటార్‌గా వ్యవహరించిన జుబిన్ బరూచా ఈ చర్చను మరో స్థాయికి తీసుకెళ్లారు. 1989లో కేవలం 16 ఏళ్ల వయసులో ఉన్న సచిన్ టెండూల్కర్‌ను బీసీసీఐ నేరుగా పాకిస్థాన్ పర్యటనకు పంపి టెస్ట్ క్రికెట్లో రంగప్రవేశం చేయించింది. అదే నమ్మకంతో వైభవ్ సూర్యవంశీ విషయంలో సాహసోపేత నిర్ణయం తీసుకోవాలని జుబిన్ బరూచా సూచిస్తున్నారు. వైభవ్ గణాంకాలు, అతని స్ట్రైక్ రేట్ ప్రస్తుతం జాతీయ జట్టు రేసులో ఉన్న చాలా మంది సీనియర్ల కంటే మెరుగ్గా ఉన్నాయని జుబిన్ బరూచా గణాంకాలతో సహా వివరిస్తున్నారు.

Will Vaibhav Sooryavanshi Follow Sachin Tendulkar Route BCCI Gets Test Debut Suggestion

వైభవ్ బ్యాటింగ్‌పై ప్రశంసలు
వైభవ్ బ్యాటింగ్ శైలిపై జుబిన్ బరూచా ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. సాధారణంగా యువ బ్యాటర్లు బంతిని చూసి త్వరగా ఫ్రంట్ ఫుట్ మీదకు వచ్చేస్తుంటారు, కానీ వైభవ్ ఎప్పుడూ బ్యాక్ ఫుట్ మీద బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాడని ఆయన తెలిపారు. బంతి స్వింగ్ అవుతున్నప్పుడు కూడా ఏమాత్రం తడబడకుండా ఆడటం వైభవ్ ప్రత్యేకత. ఇది కేవలం ప్రపంచ స్థాయి దిగ్గజ బ్యాటర్లలో మాత్రమే కనిపించే లక్షణమని ఆయన కొనియాడారు. సాంకేతికంగా వైభవ్ ఇంత పరిణతి చెందడమే అతడిని ఇతర ఆటగాళ్ల కంటే ప్రత్యేకంగా నిలబెడుతోంది.

ఓపెనింగ్ వద్దు.. కొత్త పొజిషన్ ముద్దు!
వైభవ్‌ను జట్టులోకి తీసుకోవడమే కాదు, అతడిని ఎలా వాడుకోవాలో కూడా జుబిన్ బరూచా సూచించారు. ప్రస్తుతానికి వైభవ్‌ను ఓపెనర్‌గా పంపడం కంటే, మిడిల్ ఆర్డర్‌లో బరిలోకి దింపడం వల్ల జట్టుకు ఎక్కువ ప్రయోజనం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఓపెనింగ్ స్లాట్‌లో ఉండే ఒత్తిడి కంటే, మిడిల్ ఆర్డర్‌లో వైభవ్ సహజ సిద్ధమైన ఆటను ప్రదర్శించే అవకాశం ఉంటుందని, తద్వారా వైభవ్ మ్యాచ్ విన్నర్‌గా మారతాడని బరూచా విశ్లేషించారు.

భవిష్యత్తుపై భారీ అంచనాలు
మొత్తానికి వైభవ్ సూర్యవంశీ రూపంలో భారత్‌కు ఓ అద్భుతమైన ఆణిముత్యం దొరికిందనేది కాదనలేని సత్యం. సోషల్ మీడియాలో కూడా అభిమానులు "నెక్స్ట్ సచిన్" అంటూ అతడిని ఆకాశానికెత్తుతున్నారు. సచిన్ టెండూల్కర్ 24 ఏళ్ల పాటు భారత క్రికెట్‌ను ఎలాగైతే తన భుజాలపై మోశారో.. వైభవ్ కూడా అంతటి సుదీర్ఘ కెరీర్‌ను సాగించాలని అందరూ కోరుకుంటున్నారు. అయితే బీసీసీఐ అతడిని వెంటనే టెస్టుల్లోకి తీసుకుంటుందా లేక దేశవాళీ క్రికెట్‌లో మరింత రాటుదేలనిస్తుందా అనేది ఇప్పుడు ప్రశ్నగా మిగిలింది

Story first published: Saturday, May 9, 2026, 9:08 [IST]
Other articles published on May 9, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+