న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ క్యాచ్‌ సరిగ్గా పట్టుంటే ఫలితం మరోలా!: ఓటమిపై ట్రెంట్ బౌల్ట్

ICC Cricket World Cup 2019 : Trent Boult On Coping With World Cup Heartbreak || Oneindia Telugu
Will take dog for walk by beach: Trent Boult on coping with World Cup heartbreak

హైదరాబాద్: బౌండరీ రూల్ ఆధారంగా ప్రపంచకప్ ఫైనల్లో ఓడిపోవడం చాలా బాధగా ఉందని న్యూజిలాండ్‌ బౌలర్‌ ట్రెంట్‌బౌల్ట్‌ అన్నాడు. ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత స్వదేశం చేరుకున్న అనంతరం ట్రెంట్ బౌల్డ్ తొలిసారి పైనల్లో ఓటమిపై నోరువిప్పాడు. బౌండరీల రూల్ ఆధారంగా ఓటమిని చవిచూడటం బాధగా ఉందని, ఈ విషయాన్ని అంత తేలిగ్గా మర్చిపోలేమని చెప్పాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ బాధను జీర్ణించుకోడానికి

ఈ బాధను జీర్ణించుకోడానికి

ఈ బాధను జీర్ణించుకోడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందని ట్రెంట్ బౌల్డ్ తెలిపాడు. బౌల్ట్ మాట్లాడుతూ "దాదాపు నాలుగు నెలల తర్వాత తాను ఇంటికి వెళ్తున్నాను. నా పెంపుడు కుక్కతో కలిసి బీచ్‌లో వాకింగ్‌కి వెళ్తా. ఫైనల్‌ మ్యాచ్‌లో జిమ్మీనీషమ్‌ వేసిన 49వ ఓవర్‌లో నేను.. బెన్‌స్టోక్స్‌ క్యాచ్‌ను పట్టి బౌండరీని తాకిన విషయాన్ని మర్చిపోడానికి చాలా ప్రయత్నిస్తున్నాను" అని అన్నాడు.

ఆ క్యాచ్‌ సరిగ్గా పట్టుంటే

ఆ క్యాచ్‌ సరిగ్గా పట్టుంటే

"ఆ క్యాచ్‌ సరిగ్గా పట్టుంటే ఫలితం మరోలా ఉండేది. అలాగే నేను వేసిన ఆఖరి ఓవర్‌ పదేపదే గుర్తొస్తుంది. ఆఖరి ఓవర్‌లో స్టోక్స్‌ సిక్స్‌ కొట్టడం, ఇంగ్లాండ్‌కు అనుకోని పరుగులు రావడం... ఆ తర్వాత స్కోర్లు సమం అవ్వడం చాలా విచిత్రంగా ఉంది. మాలా ఏ జట్టూ విజయానికి అంత చేరువకి వచ్చేదికాదని, అదొక అద్భుతమైన సందర్భం" అని ట్రెంట్ బౌల్ట్‌ వెల్లడించాడు.

మాకు దక్కాల్సిన కప్పు

మాకు దక్కాల్సిన కప్పు

నిజానికి ఈ ప్రపంపకప్‌లో మాకు దక్కాల్సిన కప్పు ఇంగ్లాండ్‌ను వరించిందని ఎంతో ఆవేదన చెందాడు. 2015 ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి కన్నా ప్రస్తుత ప్రపంచకప్‌ ఓటమే తమను తీవ్రంగా బాధిస్తోందని ట్రెంట్ బౌల్డ్ అన్నాడు. ఈ ప్రపంచకప్‌లో మొత్తం 17 వికెట్లు తీసిన బౌల్ట్‌ సెమీస్, ఫైనల్స్‌ మ్యాచ్‌ల్లో కీలకపాత్ర పోషించాడు.

Story first published: Friday, July 19, 2019, 13:09 [IST]
Other articles published on Jul 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X