10 వికెట్లు: కుంబ్లే రికార్డుని అశ్విన్ అధిగమిస్తాడా?
హైదరాబాద్: టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ముంబైలోని వాంఖడె స్టేడియంలో ముగిసిన నాలుగో టెస్టులో అశ్విన్ రికార్డుల మోత మోగించాడు. ఈ టెస్టులో అశ్విన్ 10 వికెట్లు తీశాడు.
తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసిన అశ్విన్, రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఆరు వికెట్లు తీశాడు. దాంతో 10 వికెట్లను అత్యధిక సార్లు తీసిన భారత రెండో బౌలర్‌గా అశ్విన్ గుర్తింపు పొందాడు. టెస్టు కెరీర్‌లో అశ్విన్ ఇలా 10 వికెట్లను తీయడం ఏడోసారి. 43 టెస్టుల్లో అశ్విన్ ఈ ఘనతను అందుకున్నాడు.
అనిల్ కుంబ్లే 132 టెస్టుల్లో ఎనిమిది సార్లు ఈ ఘనత సాధించాడు. అయితే భారత్ తరుపున అత్యధికంగా 10 వికెట్లను తీసుకున్న బౌలర్‌గా అశ్విన్ మొదటి స్ధానంలో నిలిచాడు. అనిల్ కుంబ్లే 8 సార్లు 10 వికెట్లను తన ఖాతాలో వేసుకుని మొట్టమొదటి స్ధానంలో నిలిచాడు.

కుంబ్లే రికార్డుని అధిగమించే అవకాశం
అయితే కుంబ్లే రికార్డుని అధిగమించడానికి అశ్విన్‌కు ఎంతో సమయం పట్టకపోవచ్చని క్రీడా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరిస్‌లో వేరొక మ్యాచ్ మిగిలి ఉంది. మరోవైపు వచ్చే ఏడాది బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలు భారత్ పర్యటనకు రానుండటంతో అశ్విన్ ఈ ఘనతను అందుకునే అవకాశం ఉంది.

200 వికెట్లను అత్యంత వేగంగా సాధించిన రెండో బౌలర్
ఇటీవలే టెస్టుల్లో 200 వికెట్లను అత్యంత వేగంగా సాధించిన రెండో బౌలర్‌గా కూడా అశ్విన్ నిలిచిన సంగతి తెలిసిందే. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టులో మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ (236 వికెట్లు) టెస్టు వికెట్లను అశ్విన్ అధిగమించాడు.

భారత్ తరుపున అత్యధిక వికెట్లు సాధించిన ఏడో బౌలర్
ముంబై వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ మొయిన్ అలీ వికెట్‌ను తీయడంతో భారత్ తరుపున అత్యధిక వికెట్లు సాధించిన ఏడో బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్ ఘనత సాధించాడు. దీంతో మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ (236 వికెట్లు) టెస్టు వికెట్లను అశ్విన్ అధిగమించిన సంగతి తెలిసిందే.

నాలుగో టెస్టులో 12 వికెట్లు
చివరి రోజైన సోమవారం 182/6 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ని కొనసాగించిన ఇంగ్లాండ్ 13 పరుగులు మాత్రమే జోడించి 195 పరుగులకు ఆలౌటైంది. అశ్విన్ అద్భుతంగా రాణించడంతో సోమవారం ఆట ప్రారంభమైన 30 నిమిషాల్లోనే ఇంగ్లాండ్ మూడు వికెట్లను కోల్పోయింది. ఇంగ్లండ్ ఓటమి ఖాయమైంది. దీంతో ఇన్నింగ్స్ 36 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications