Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రంజీ ట్రోఫీకి సమయం ఆసన్నమైంది..!!

Will Ranji Trophy produce another first-time champion?

హైదరాబాద్: దేశవాళీ అత్యున్నత టోర్నీ రంజీ ట్రోఫీకి రంగం సిద్ధమైంది. కొత్తగా 7 ఈశాన్య రాష్ట్రాల చేరికతో మొత్తం 37 జట్లతో రంజీ ట్రోఫీ పోరు మొదలవనుంది. గురువారం ప్రారంభంకానున్న ఈ టోర్నీలో టీమ్‌ఇండియా ఆటగాళ్లు పుజారా (సౌరాష్ట్ర), అశ్విన్‌, మురళీ విజయ్‌ (తమిళనాడు) బరిలో దిగుతున్నారు. ఆస్ట్రేలియాలో 4 టెస్టుల సిరీస్‌ నేపథ్యంలో పుజారా, అశ్విన్‌, విజయ్‌లకు రంజీ ట్రోఫీ మ్యాచ్‌ ప్రాక్టీస్‌గా ఉపయోగపడనుంది.

 గ్రూప్‌-బిలో హైదరాబాద్‌, ఆంధ్ర జట్లు

గ్రూప్‌-బిలో హైదరాబాద్‌, ఆంధ్ర జట్లు

గాయం నుంచి కోలుకుంటున్న పృథ్వీ షా తొలి మ్యాచ్‌కు దూరం కానున్నాడు. షా ఈ ట్రోఫీలో ముంబై తరపున ఆడాల్సి ఉంది. హైదరాబాద్‌, ఆంధ్ర జట్లు గ్రూప్‌-బిలో ఉన్నాయి. గురువారం ప్రారంభమయ్యే మ్యాచ్‌ల్లో తిరువనంతపురంలో కేరళతో హైదరాబాద్‌.. విశాఖపట్నంలో పంజాబ్‌తో ఆంధ్ర తలపడతాయి.

ప్లేట్‌ గ్రూపు దశలో పోటీపడేందుకు 9 జట్లు

ప్లేట్‌ గ్రూపు దశలో పోటీపడేందుకు 9 జట్లు

మరోవైపు బీసీసీఐ పరిపాలన సంక్షోభం నేపథ్యంలో రంజీ ట్రోఫీ నిర్వహణ బోర్డు అధికారులకు అతిపెద్ద సవాలే. కొత్తగా మణిపూర్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, మిజోరం, ఉత్తరాఖండ్‌, సిక్కిం, నాగాలాండ్‌, మేఘాలయాలతో పాటు బిహార్‌, పుదుచ్చేరి జట్లు ఈసారి రంజీ ట్రోఫీలో బరిలో దిగుతున్నాయి. ఈ 9 జట్లు ప్లేట్‌ గ్రూపులో తలపడతాయి.

మిగతా జట్లు గ్రూప్‌-ఎ, బి, సిలలో

మిగతా జట్లు గ్రూప్‌-ఎ, బి, సిలలో

నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడిన అనుభవం లేకపోవడంతో ఈశాన్య జట్లకు ఇతర రాష్ట్రాల ఆటగాళ్లే ఎక్కువగా ప్రాతినిధ్యం వహించనున్నారు. మిగతా జట్లు గ్రూప్‌-ఎ, బి, సిలలో ఉన్నాయి. రంజీ ట్రోఫీ మ్యాచ్‌ల నిర్వహణ కోసం దేశవ్యాప్తంగా 50 మైదానాల్ని సిద్ధం చేసినట్లు బీసీసీఐ జనరల్‌ మేనేజర్‌ సాబా కరీం తెలిపాడు.

ఢిల్లీ రంజీ జట్టుకు కన్సల్టెంట్ కోచ్‌గా

ఢిల్లీ రంజీ జట్టుకు కన్సల్టెంట్ కోచ్‌గా

దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ లాన్స్ క్లూసెనర్ ఢిల్లీ రంజీ జట్టుకు కన్సల్టెంట్ కోచ్‌గా నియమితులయ్యారు. డీడీసీఏ ప్రెసిడెంట్ రజత్ శర్మ మాట్లాడుతూ "ఢిల్లీ రంజీ జట్టు క్రికెట్ కన్సల్టెంట్‌గా లాన్స్ క్లూసెనర్ నియమితులయ్యారు. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే వన్డే టోర్నమెంట్‌తో సహా ఫిబ్రవరి 2019లో ప్రారంభమయ్యే దేశవాళీ టీ20 టోర్నమెంట్‌కి కోచ్‌గా వ్యవహారిస్తారు" అని తెలిపారు. మాజీ ఢిల్లీ కెప్టెన్ మిథున్ మన్హాస్ ప్రస్తుతం ఢిల్లీ రంజీ జట్టు హెడ్ కోచ్‌గా ఉన్నారు.

Story first published: Thursday, November 1, 2018, 11:40 [IST]
Other articles published on Nov 1, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+