Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsBAN: తొలి టెస్టుకు వరుణుడి ముప్పు ఉందా?.. వాతావరణం ఎలా ఉండబోతోంది?

Will rain play spoil sport during INDvsBAN first Test

ఎవరూ ఊహించని విధంగా బంగ్లాదేశ్ చేతిలో వన్డే సిరీస్ ఓడిన టీమిండియా.. కీలకమైన టెస్టు సిరీస్‌కు సిద్ధమైంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో వెటరన్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌లో సారధ్య బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. రోహిత్ స్థానంలో యువ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్‌ను ఎంపిక చేసినా.. అతనికి ఆడే అవకాశం రావడం కష్టంగా కనపడుతోంది. శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌లో జట్టుకు ఓపెనింగ్ చేస్తారని సమాచారం.

టీమిండియాకు కీలకం..

టీమిండియాకు కీలకం..

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ చేరే అవకాశాలు మెరుగు పడాలంటే భారత జట్టు ఈ టెస్టు సిరీస్‌లో రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించి తీరాలి. లేకుంటే డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే అవకాశాలు బాగా దెబ్బతింటాయి. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న భారత జట్టు ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్‌తోపాటు ఆ తర్వాత జరిగే టెస్టు సిరీసుల్లో విజయం కూడా చాలా కీలకం.

అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ లేకపోవడం టీమిండియాకు పెద్ద లోటని విశ్లేషకులు అంటున్నారు. అలాగే జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ కూడా లేకుండా భారత జట్టు బరిలో దిగుతోంది. దీంతో కీలకమైన ఈ సిరీస్‌లో విజయం కోసం భారత జట్టు గట్టి పోటీ ఎదుర్కోక తప్పదు.

సీనియర్లు లేని జట్టు..

సీనియర్లు లేని జట్టు..

ఈ సిరీస్‌లో భారత జట్టు అన్ని విభాగాల్లోనూ సీనియర్లను మిస్ అవుతోంది. రెండో వన్డేలో బొటనవేలికి గాయమవడంతో రోహిత్ శర్మ జట్టుకు దూరమయ్యాడు. దీంతో అనుభవజ్ఞుడైన కెప్టెన్‌తోపాటు, ఓపెనర్‌ను కూడా భారత జట్టు కోల్పోయింది. అలాగే గాయాలతో జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ కూడా ఈ సిరీస్‌కు దూరమయ్యారు. దీంతో భారత జట్టు పేస్ బౌలింగ్ విభాగం బలహీనంగా కనపడుతోంది.

ఈ లోటును పూడ్చే బాధ్యత సిరాజ్, ఉమేష్ యాదవ్‌లపై పడింది. వీరికి జయదేవ్ ఉనద్కత్ లేదా మరెవరైనా సహకారం అందించాల్సి ఉంటుంది. వీరితోపాటు రవీంద్ర జడేజా కూడా గాయంతో ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో కొత్త కుర్రాడికి ఆడే అవకాశం దక్కే అవకాశం ఉంది. దీంతో ఆల్‌రౌండర్ విభాగంలో కూడా భారత జట్టు సీనియర్లు లేకుండానే బరిలో దిగుతోంది.

వాతావరణం ఎలా ఉందంటే?

బుధవారం మొదలయ్యే ఈ మ్యాచ్ ఆ తర్వాత ఐదు రోజుల పాటు జరుగుతుంది. ఈ ఐదు రోజుల్లోనూ మ్యాచ్ జరిగే చట్టోగ్రాంలో వర్షం పడే అవకాశం ఏమాత్రం లేదని వాతావరణ శాఖ తేల్చిచెప్పింది. డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 18 వరకు ఇక్కడ కనీసం జల్లులు కూడా పడే అవకాశం కనిపించడం లేదని వాతావరణ శాఖ నివేదిక తెలుపుతోంది.

దీంతో ఐదు రోజులపాటు ఆటంకంలేని ఆటను అభిమానులు ఆస్వాదిస్తారని స్పష్టం చేస్తోంది. దీంతో భారత జట్టు తమ డబ్ల్యూటీసీ పాయింట్లు పెంచుకునేందుకు గట్టి ప్రయత్నం చేసే సయమంలో ఉంది. అయితే భారత జట్టును ఎలాగైనా ఓడించాలని ఆతిథ్య బంగ్లా జట్టు బలంగా ఆశిస్తోంది. ఈ సిరీస్‌లో అయినా బంగ్లాను తక్కువ అంచనా వేస్తే భారత జట్టు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మాజీలు హెచ్చరిస్తున్నారు.

Story first published: Tuesday, December 13, 2022, 21:49 [IST]
Other articles published on Dec 13, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+