Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంతే ఫిట్‌గా ఉంటే మరో పదేళ్లు క్రికెట్‌లో కొనసాగుతా: కోహ్లీ

హైదరాబాద్: సరైన ఫిట్‌నెస్‌ను కలిగి ఉంటే మరో పదేళ్లు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతానని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. ఇంకో రెండు నెలల్లో కోహ్లీకి 29 ఏళ్లు పూర్తవుతాయి. శుక్రవారం ఓ ప్రమోషన్ ఈవెంట్‌లో పాల్గొన్న కోహ్లీ తాను ఇంకో పదేళ్ల పాటు ఆటలో కొనసాగాలనుకుంటున్నట్లు చెప్పాడు.

అందు కోసం ఇప్పటిలాగే ఫిట్‌గా ఉంటే చాలని అన్నాడు. మనలో చాలా మంది ఆటగాళ్లకు తమ కెరీర్‌ను ఎప్పుడు ముగించాలనే దానిపై స్పష్టత ఉండదు. చాలామందికి వాళ్లు ఎంత పెద్ద స్థాయికి వెళ్లగలరన్నది తెలియదు. మన సామర్థ్యంలో 70 శాతం వరకే ఉపయోగించుకుంటుంటాం. ఈ స్థితిలో మనకు మనం ప్రేరణ ఇచ్చుకోవడం అవసరం. ఉదాహరణకు నేను ఇప్పుడు శ్రమిస్తున్న తరహాలోనే మున్ముందు కూడా కష్టపడితే మరో పదేళ్లు సునాయాసంగా ఆడగలను' అని కోహ్లీ అన్నాడు.

 Will play for another 10 years if I remain fit: Virat Kohli

తాను కుర్రాడిగా ఉన్నప్పుడు జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్.. ఆల్ ఇంగ్లండ్‌లో గెలువడం తనకు చాలా స్ఫూర్తినిచ్చిందని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. 'గోపీ సర్ ఆల్‌ ఇంగ్లండ్ మ్యాచ్‌ను నా స్నేహితులతో కలిసి చూశా. అది ఇప్పటికీ గుర్తుంది. అప్పట్లో నా స్నేహితుల్లో చాలా మంది రాష్ట్రస్థాయి టోర్నీల్లో ఆడేవారు. గోపీ సాధించిన ఘనతలను చూసి గర్వపడుతున్నాం. సైనా, సింధు, శ్రీకాంత్‌లాంటి ప్రపంచస్థాయి ఆటగాళ్లను తయారు చేయడం మామూలు విషయం కాదు' అని కోహ్లీ పేర్కొన్నాడు.

ప్రస్తుతం భారత్ తరుపున 60 టెస్టులాడి 4658 పరుగులు, 194 వన్డేల్లో 8587 పరుగులు చేసిన కోహ్లీ యువ క్రికెటర్లను ప్రోత్సహించేందుకు గాను విరాట్ కోహ్లీ ఫౌండేషన్ పేరిట స్కాలర్‌షిప్‌‌లను అందిస్తున్నాడు. దీనికి సంబంధించి ఆర్పీ-సంజయ్ గోయంకా గ్రూపుతో భాగస్వామ్యమయ్యాడు. క్రీడారంగంలో అద్భుత ప్రదర్శన చేసిన యువ ఆటగాళ్లకు ఏడాదికి రూ.2 కోట్లు వరకు స్కాలర్ షిప్ అందించాలని విరాట్ కోహ్లీ ఫౌండేషన్ ప్రతిజ్ఞ పూనింది.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+