గెలిపించే సత్తా ఉన్నవాడినే కోచ్‌గా ఎంపిక చేస్తాం: గంగూలీ
హైదరాబాద్: మ్యాచ్‌లను గెలిపించగలిగే సత్తా ఉన్నవాడినే కోచ్‌గా ఎంపిక చేస్తామని క్రికెట్ సలహా కమిటీలో సభ్యుడిగా ఉన్న సౌరభ్ గంగూలీ వ్యాఖ్యానించాడు. కోచ్‌గా అనిల్ కుంబ్లే రాజీనామాతో ఇప్పుడు టీమిండియా కొత్త కోచ్ ఎవరన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
వచ్చే నెలలో భారత జట్టు శ్రీలంక పర్యటన ఉన్న నేపథ్యంలో ఆ లోపు కోచ్ ఎంపిక ప్రక్రియ పూర్తి అవుతుందని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బీసీసీఐ మళ్లీ కోచ్ పదవి కోసం దరఖాస్తులను కూడా ఆహ్వానించింది. కోచ్ ఎంపికలో కీలకపాత్ర పోషిస్తున్న సీఏసీలో సభ్యుడిగా ఉన్న గంగూలీ ఈ విషయంపై తొలిసారి స్పందించాడు.

కోచ్‌గా ఎవరిని చేస్తారు
కోచ్‌గా ఎవరిని చేస్తారు అని మీడియా ప్రశ్నించగా.. ఎవరు మ్యాచ్‌లను గెలిపిస్తారో వాళ్లనే కోచ్‌ను చేస్తామని గంగూలీ అన్నాడు. క్రికెట్ సలహా కమిటీ సరైన కోచ్ కోసం అన్వేషిస్తోందని తెలిపాడు. జట్టులోని సభ్యులను సమన్వయం చేసుకుపోయే మనస్తత్వం, కెప్టెన్ నిర్ణయాలను గౌరవించే వ్యక్తికోసం సలహా కమిటీ సభ్యులు వెతుకున్నారని తెలిపాడు.

బీసీసీఐ ఆదేశాల ప్రకారం నడుచుకుంటాం
‘చెప్పడానికేమీ లేదు. ఆదేశాల ప్రకారం నడుచుకుంటాం. మీరంతా నా వద్ద సమాచారం రాబట్టాలనుకుంటున్నట్టు తెలుసు. ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో నేను జవాబు చెప్పలేను' అని అన్నారు. దీనికోసం మళ్లీ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, జూలై 9లోపు కొత్త దరఖాస్తులను పంపవచ్చని చెప్పాడు.

వారిని కూడా పరిగణనలోకి తీసుకుంటాం
గతంలో దరఖాస్తు చేసుకున్న వారినికూడా పరిగణలోకి తీసుకుంటామని అన్నాడు. కోచ్ ఎంపికలో బీసీసీఐ సూచనలు తీసుకుంటామని సౌరవ్ తెలిపాడు. అండర్-19 కోచ్ రాహుల్ ద్రవిడ్ సోమవారం బీసీసీఐ ప్రధాన కార్యాలయానికి రానున్నారా? అని ప్రశ్నించగా తనకు దీని గురించి తెలియదని చెప్పాడు.

శ్రీలంక పర్యటనలోపే కోచ్ ఎంపిక
జూలై 21 నుంచి ప్రారంభం కానున్న శ్రీలంక పర్యటనలోపే కోచ్ ఎంపిక చేస్తామని గంగూలీ చెప్పాడు. మరోవైపు టీమిండియా కొత్త కోచ్ నియామకంపై బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. కోచ్ నియామక ప్రక్రియ గురించి గంగూలీ, సచిన్, లక్ష్మణ్‌తో కూడిన క్రికెట్ సలహా కమిటీ నిర్ణయం తీసుకొంటుందని అన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications