Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆరేళ్ల బంధానికి ముగింపు: నచ్చితేనే బ్రాండింగ్ చేస్తానన్న కోహ్లీ

హైదరాబాద్: తాను వాడని, నమ్మకం లేని వాటికి అంబాసిడర్‌గా ఉండనని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి స్పష్టం చేశాడు. ప్రధానంగా ఫిట్‌నెస్‌ను కాపాడుకునే క్రమంలో సాఫ్ట్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో పెప్పీతో తనకున్న బంధానికి పుల్ స్టాఫ్ పెట్టినట్లు కోహ్లీ తెలిపాడు.

'కొన్ని ఉత్పత్తులను నేను వాడటం లేదు. కేవలం డబ్బులు తీసుకుంటున్నాను కాబట్టి అలాంటి వాటిని ప్రమోట్‌ చేస్తూ వాడమని అభిమానులకు చెప్పలేను. నేను వాడని, నాకు నమ్మకం లేని వాటికి అంబాసిడర్‌గా ఉండలేను' అని విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు.

Will not endorse something that I don’t believe in or consume: Virat Kohli

ఈ ఏడాది జూన్‌లో పెప్సీ కూల్ డ్రింక్ బ్రాండ్ అంబాసిడర్‌గా కోహ్లీ తప్పుకున్న సంగతి తెలిసిందే. పెప్సికో సంస్థతో ఉన్న ఆరేళ్ల అనుబంధానికి కోహ్లీ ముగింపు పలికాడు. 29 ఏళ్ల కోహ్లీ ప్రస్తుతం 17 ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు.

ఇందులో ఆడి, పూమా, ఎంఆర్ఎఫ్, టిస్సోట్, బూస్ట్, కోల్గేట్, విక్స్ తదితర వాటికి కోహ్లీ అంబాసిడర్‌గా ఉన్నాడు. ఇదిలా ఉంటే కోహ్లీ ప్రస్తుతం శ్రీలంకతో స్వదేశంలో జరగనున్న సిరిస్ సన్నాహాకాల్లో ఉన్నాడు. భారత్-శ్రీలంక జట్ల మధ్య నవంబర్ 16న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టెస్టు జరగనుంది.

Story first published: Monday, November 13, 2017, 12:18 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+