Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final Reserve Day:98 ఓవ‌ర్ల‌లో ఏదైనా సాధ్యమే..భారత్ కంటే న్యూజిలాండ్‌కే విజ‌యావ‌కాశాలు ఎక్కువ!

Will New Zealand Be First WTC Final 2021 Champion

సౌథాంప్టన్‌: ప్రతిష్టాత్మక ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డ‌బ్ల్యూటీసీ) ఫైనల్‌ రిజర్వుడే అయిన ఆరో రోజుకు చేరుకుంది. భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు హోరాహోరీగా పోరాడుతున్నాయి. దొరికిన సమయంలోనే ఆధిపత్యం చెలాయించేందుకు ఇరు జట్లు ప్రయత్నిస్తున్నాయి. మంగళవారం 80 ఓవర్లకు పైగా ఆట జరగడంతో గెలుపు సమీకరణాలు రసవత్తరంగా మారాయి. రెండు రోజులు పూర్తిగా వ‌ర్షం వ‌ల్ల ఆట‌ను కోల్పోవ‌డంతో ఇవాళ అత్య‌ధికంగా 98 ఓవ‌ర్లు వేసే అవ‌కాశాలు ఉన్నాయి. దీంతో సోమవారం వరకు మ్యాచ్ డ్రా అవుతుందని అందరూ అనుకున్నా.. ఇప్పుడా పరిస్థితి లేదు.

న్యూజిలాండ్‌కే విజ‌యావ‌కాశాలు అధికం:

న్యూజిలాండ్‌కే విజ‌యావ‌కాశాలు అధికం:

ఈ రోజు వర్షం, వెలుతురుతో ఎలాంటి ఆటకం లేకపోతే 98 ఓవ‌ర్లు వేసే అవ‌కాశాలు ఉన్నాయి. ఇప్ప‌టికే రెండ‌వ ఇన్నింగ్స్‌లో 32 పరుగుల ఆధిక్యంలో ఉన్న భారత్.. ఈ మ్యాచ్‌లో గెలిచే అవ‌కాశాలు ఉన్నాయి. న్యూజిలాండ్‌ కూడా గెలిచే ఛాన్సు ఉంది. ఇక మ్యాచ్ డ్రా అయ్యే పాజిబులిటీ కూడా ఉంది. నిజానికి న్యూజిలాండ్‌కే విజ‌యావ‌కాశాలు అధికంగా ఉన్నాయి. రిజ‌ర్వ్ డే రోజున ఒక‌వేళ టీమిండియాను త్వ‌ర‌గా ఔట్ చేస్తే, టార్గెట్‌ను చేజ్ చేసేందుకు వాళ్ల‌కు కావాల్సిన స‌మ‌యం ఉంటుంది. ఇక భారత్‌కు కూడా గెలిచే ఛాన్సు ఉంది. కోహ్లీసేన దూకుడుగా బ్యాటింగ్ చేసి డిక్లేర్ చేస్తే.. అప్పుడు కివీస్‌ను వేగంగా ఆలౌట్ చేయాల్సి ఉంటుంది.

తొలి ఆరు రోజుల క్రికెట్:

తొలి ఆరు రోజుల క్రికెట్:

బుధవారం సౌథాంప్టన్‌లో ఏం జ‌రిగినా.. అదో చ‌రిత్రాత్మ‌క రోజు అవుతుంది. 2005 త‌ర్వాత జ‌రుగుతున్న తొలి ఆరు రోజుల క్రికెట్ మ్యాచ్ ఇదే. ఇక 1975 త‌ర్వాత ఇంగ్లండ్‌లో జ‌రుగుతున్న మొద‌టి ఆరు రోజుల క్రికెట్ మ్యాచ్ కూడా ఇది. అయిదో రోజు కొంత టెన్ష‌న్ పుట్టించినా.. ఇక రిజ‌ర్వ్ డే రోజు మాత్రం థ్రిల్ల‌ర్ అనివార్యంగా క‌నిపిస్తున్న‌ది. ఇక బుధవారం సౌథాంప్టన్‌ వాతావరణం ఎలా ఉంటుందోనన్న ఆసక్తి ఏర్పడింది. మంగళవారంతో పోలిస్తే బుధవారం వాతావరణం మరింత మెరుగ్గా ఉంటుందని తెలిసింది.

 32 పరుగుల లోటుతో:

32 పరుగుల లోటుతో:

తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 217 పరుగులకు ఆలౌటైంది. డేవాన్‌ కాన్వే (54), కేన్‌ విలియమ్సన్‌ (49) రాణించడంతో కివీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 249 పరుగులు చేసింది. ఆ తర్వాత 32 పరుగుల లోటుతో బ్యాటింగ్‌ ఆరంభించిన భారత్ ఐదో రోజు ఆట ముగిసేసరికి 64/2తో నిలిచింది. ప్రస్తుతం 32 పరుగుల ఆధిక్యంలో ఉంది. చెతేశ్వర్‌ పుజారా (12 బ్యాటింగ్‌), విరాట్‌ కోహ్లీ (8 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ తొలి సెషన్‌ పూర్తిగా నిలవడంపైనే మ్యాచ్ ఆధారపడివుంది.

Story first published: Wednesday, June 23, 2021, 13:04 [IST]
Other articles published on Jun 23, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+