Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆడినంత వరకు ఆర్‌సీబీతోనే.. జట్టును వీడే ఆలోచన అస్సలు లేదు: కోహ్లీ

Will never leave RCB: Virat Kohli talks about his future with RCB
IPL 2020 : Virat Kohli Makes Big Statement On His Future @ RCB

ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌లో ఆడినంత కాలం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) తరఫునే ప్రాతినిధ్యం వహిస్తానని టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ స్పష్టం చేసాడు. బెంగళూరు జట్టు నుంచి వెళ్లిపోయే ఆలోచన అస్సలు లేదన్నాడు. దక్షిణాఫ్రికా క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌తో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో విరాట్ కోహ్లీ మాట్లాడాడు. ఇద్దరూ ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరఫున ఆడుతున్న సంగతి తెలిసిందే.

 ఆఖరి వరకు ఆర్‌సీబీతోనే:

ఆఖరి వరకు ఆర్‌సీబీతోనే:

ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ సందర్భంగా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'ఆర్‌సీబీతో ప్రయాణం ఓ అద్భుతం. ఐపీఎల్ కప్‌ను సాధించడం మా కల. అయితే సీజన్‌లో మెరుగ్గా రాణించలేకపోయామనే బాధ ఉండొచ్చు. కానీ.. బెంగళూరు నుంచి వెళ్లిపోయే ఆలోచన అస్సలు లేదు. ఈ జట్టును ఎప్పటికీ వదిలి వెళ్లను. అభిమానులు, వారి విధేయత ఎంతో గొప్పగా ఉంటుంది. అభిమానులు చూపే ప్రేమ ఎప్పటికీ మరచిపోను' అని అన్నాడు. ఐపీఎల్‌లోకి వచ్చే యువకులు పరుగుల వరద పారించాలని కోహ్లీ సూచించాడు.

 డివిలియర్స్‌ కూడా:

డివిలియర్స్‌ కూడా:

గత తొమ్మిదేళ్లగా జట్టులో ఉంటున్న డివిలియర్స్‌ కూడా ఆర్‌సీబీని వీడనని తెలిపాడు. 'నేను కూడా కోహ్లీ లాగే. ఆర్‌సీబీని ఎప్పటికీ విడిచిపెట్టి వెళ్లను. పరుగులు సాధిస్తూనే ఉంటాను. ఈ ప్రయాణం అద్బుతంగా ఉంది' అని మిస్టర్‌ 360 అన్నాడు. దక్షిణాఫ్రికా మాజీలు గ్యారీ క్రిస్టన్‌, డంకన్ ఫ్లెచర్‌, మార్క్‌ బౌచర్‌ తనకు సహాయం చేశారని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. 'గ్యారీ ఎప్పుడూ సానుకూలంగా స్పందిచేవారు. బౌచర్‌ షార్ట్‌ బంతులను ఎదుర్కొవాలని 2008లో సూచించాడు. అతడికి గొప్ప విజన్‌ ఉంది. ఫ్లెచర్‌కు ఆటపై ఎంతో అవగాహన ఉంది. ఎంతో మంది ఆటగాళ్లు నా ఆటను మెరుగుపర్చుకోవడంలో సహాయపడ్డారు' అని కోహ్లీ పేర్కొన్నాడు.

క్రెడిట్ మొత్తం అనుష్కదే:

క్రెడిట్ మొత్తం అనుష్కదే:

ఇటీవల ఆన్‌లైన్ సెషన్‌లో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'నిజాయతీగా చెప్పాలంటే అనుష్క శర్మతో ప‌రిచ‌యం నాలో చాలా మార్పుల‌కు కార‌ణ‌మైంది. గ‌తంలో నేను ప్ర‌తీ చిన్న విష‌యానికి కొప్ప‌డేవాడిని. తీవ్ర అసహనానికి గురయ్యేవాడిని. ఇప్పుడు ఆ ధోర‌ణి మారింది. అనుష్క నాలో శాంత‌న్ని నింపింద‌నుకుంటా. అనుష్క వ్యక్తిత్వం, ఎలాంటి పరిస్థితులలో ఉన్నా ఆమె ప్రశాంతంగా ఉండడం నిజంగా నన్ను ప్రేరేపించింది' అని తెలిపాడు. విరుష్క జోడీ 2013లో ఓ షాంపూ ప్రకటన కోసం చేసిన చిత్రీకరణలో మొదటిసారి కలుసుకున్నారు.

Story first published: Saturday, April 25, 2020, 11:59 [IST]
Other articles published on Apr 25, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+