Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ms Dhoni: ఐపీఎల్ 2023లో ఆడతాడో లేదో చెప్పేసిన ధోనీ..!

Will MS Dhoni Play And Captain For Chennai Super Kings In IPL 2023?

నిన్నటి మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే భీకరమైన బ్యాటింగ్ వల్ల 202పరుగుల భారీ స్కోరు సాధించిన చెన్నై సూపర్ కింగ్స్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను 13పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌‌లో గెలుపోటములను పక్కన పెడితే ఈ మ్యాచ్‌కు హైలెట్ విషయం ధోనీ కెప్టెన్సీ. ఈ మ్యాచ్‌కు ముందు చెన్నై ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో ఆరు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో కెప్టెన్సీ నుంచి రవీంద్ర జడేజా వైదొలుగుతున్న ప్రకటించిన సంగతి తెలిసిందే.

దీంతో కెప్టెన్సీని తిరిగి ఎంఎస్ ధోనీ చేపట్టాడు. ఈ మ్యాచ్‌ ప్రారంభానికి ముందు టాస్ కోసం ధోనీ, సన్ రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గ్రౌండ్లోకి వచ్చారు. టాస్ గెలిచిన కేన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక టాస్ సమయంలో ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తను తర్వాతి సీజన్ ఆడతాడో లేడో చెప్పేశాడు. ఇక చెన్నైకి ధోనీ తిరిగి కెప్టెన్సీ చేపట్టడంతో గ్రౌండ్లో అద్భుత స్వాగతం లభించింది. రెండు సంవత్సరాల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీకి అంతులేని ప్రేక్షకాదరణ ఇంకా కొనసాగుతూనే ఉంది.

వచ్చే సీజన్లోనూ ఎల్లో జెర్సీలో కన్పిస్తా

వచ్చే సీజన్లోనూ ఎల్లో జెర్సీలో కన్పిస్తా

టాస్ ఓడిన తర్వాత ధోనీని కామెంటర్ డానీ మెరిసన్ అభిప్రాయాన్ని కోరే క్రమంలో మళ్లీ కెప్టెన్‌గా వెల్ కం.. తర్వాతి సీజన్ గురించి ఏమంటారు అని ప్రశ్నించాడు. దీనిపై ధోనీ తన సస్పెన్స్ వేలో ఆన్సరిచ్చాడు. 'వచ్చే సీజన్‌లో నేను మళ్లీ ఎల్లో జెర్సీలో కన్పించడం ఖాయం. అయితే ఈ ఎల్లో జెర్సీనా.. లేకపోతే వేరే ఎల్లో జెర్సీనా అనేది వేరే విషయం' అంటూ సస్పెన్స్ ఇచ్చాడు.

ధోనీ మాటల్లో ఆంతర్యం ఇదే

ధోనీ మాటల్లో ఆంతర్యం ఇదే

ధోనీ మాటలను బట్టి చూస్తే.. వచ్చే సీజన్లోనూ తాను ఆడతానని హింట్ ఇచ్చినట్లే ఉంది. ఎప్పుడైన సరే ధోనీ తన కెప్టెన్సీని మరొకరికి అందించాకే రిటైర్మెంట్ ప్రకటించడం ఇంతవరకు చూశాం. ఈ క్రమంలో ఈ సీజన్లో జడేజాకు కెప్టెన్సీ అప్పగించిన ధోనీ.. నెక్ట్స్ సీజన్ రిటైర్ అవుతాడనే అందరూ అనుకున్నారు. కానీ జడేజా వైఫల్యంతో మళ్లీ కెప్టెన్సీ పగ్గాలు ధోనీకే అప్పజెప్పాడు. దీంతో కెప్టెన్‌గా ఉన్నపలంగా ధోనీ రిటైర్ ఇవ్వరనే విషయం మేరకు తర్వాతి సీజన్లోనూ ధోనీ ఆడతాడని తెలుస్తోంది. ఇక పోతే వేరే ఎల్లో జెర్సీ అని పేర్కొన్న ధోనీ అలా ఎందుకన్నాడో మాత్రం అంతుపట్టలేదు.

ప్రత్యామ్నాయ లీడర్ షిప్ కోసం చూస్తున్నాడా?

ప్రత్యామ్నాయ లీడర్ షిప్ కోసం చూస్తున్నాడా?

అయితే ఇక ఈ సీజన్లో ఇంకా 5 లీగ్ మ్యాచ్‌లు మిగిలే ఉన్న తరుణంలో.. చెన్నై సూపర్ కింగ్స్ జయాపజయాలు ఎలా ఉంటాయనే దాన్ని బట్టి కూడా ధోనీ తన డిషిషన్ ఛేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇదే సీజన్లో సరైన లీడర్ షిప్ లక్షణాలున్న ఓ ప్లేయర్‌ను ధోనీ పట్టుకుంటే అతనికి కెప్టెన్ పగ్గాలు అప్పజెప్పి ఐపీఎల్‌కు వీడ్కోలు పలకొచ్చు. జడేజాకు మరోసారి కెప్టెన్సీ అప్పజెప్పే అవకాశాలు లేకపోలేదు. కానీ జడేజాకు ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం టీంలో చెప్పుకోదగ్గ ప్లేయర్లు లేకపోవడం చెన్నైకి లోటే. ఎందుకంటే.. రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు లాంటి ప్లేయర్లు దాదాపు కెరీర్ చివరికి చేరుకున్నారు.

సీఎస్కే తర్వాతి కెప్టెన్ రుతురాజ్..?

సీఎస్కే తర్వాతి కెప్టెన్ రుతురాజ్..?

ఇక యంగ్ ప్లేయర్లలో దూబే, రుతురాజ్ గైక్వాడ్ ఉన్నారు. వారిలో దూబే నిలకడలేని తత్వం వల్ల అతనికి కెప్టెన్సీని ససేమిరా అప్పజెప్పే వీలులేదు. దీంతో చెన్నైకి ఏకైక ఆప్షన్‌గా కన్పిస్తుంది రుతురాజే. ఎందుకంటే వరుసగా మూడు సీజన్లలో చెన్నై తరఫున ఆడడం.. మంచి స్కోరింగ్ చేయగల సత్తా ఉండడం.. మంచి ఫీల్డర్ కావడం రుతురాజ్‌కు ప్లస్. అలాగే మెగావేలానికి ముందు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో రుతురాజ్ ఒకడు.

Story first published: Monday, May 2, 2022, 10:44 [IST]
Other articles published on May 2, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+