For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ కింద ఆడిన ఏ ఆటగాడైనా బాధపడతాడు: బ్రావో

By Srinivas

చెన్నై: ఇండియన్ ప్రీమియల్ లీగ్ (ఐపీఎల్)లో మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలో ఆడలేకపోతున్నందుకు విండీస్ స్టార్ ఆటగాడు డ్వేన్ బ్రావో ఒకింత బాధను వ్యక్తం చేశాడు. డ్వేన్ బ్రావో గత కొన్నేళ్లుగా ధోనీ కెప్టెన్‌గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పుడు లేదు. ఆ జట్టుతో పాటు రాజస్థాన్ రాయల్స్ కూడా లేదు. ఈ రెండు జట్ల బదులు కొత్తగా రెండు జట్లువచ్చాయి. ఈ జట్లు కొందరు ఆటగాళ్లను పంచుకున్నాయి. ఇందులో భాగంగా ధోనీ, బ్రావోలు వేర్వేరు జట్లకు వెళ్లిపోయారు. దీనిపై బ్రావో మాట్లాడాడు.

Will miss MS Dhoni the skipper: Dwayne Bravo

ఐపీఎల్‌లో ధోని నాయకత్వంలో ఆడలేకపోతుండటం పట్ల విచారం వ్యక్తం చేశాడు. గత ఏడాది వరకు ధోని నేతృత్వంలోని చెన్నైకు ఆడిన తాను, ఈ ఏడాది గుజరాత్‌ లయన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయాన్ని చెప్పాడు. ధోని పుణెకు కెప్టెన్‌‌గా ఉన్నాడని చెప్పాడు.

ధోని నాయకత్వానికి దూరమవుతున్నానని, నేనే కాదు ధోని కింద ఆడిన ఏ ఆటగాడైనా ఇలాగే బాధపడతాడని, అయితే వేర్వేరు కెప్టెన్ల కింద ఆడటానికి సిద్ధంగా ఉండాలని, గుజరాత్‌ జట్టులో మేమందరం సురేష్ రైనాకు మద్దతుగా నిలుస్తామని చెప్పాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+