Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023 : కేన్ మామను వేలంలో ఎవరైనా కొంటారా?

will Kane williamson be sold at Mini Auction

భారత్‌తో మూడు టీ20ల సిరీస్‌లో న్యూజిల్యాండ్ జట్టు ఓడిపోయింది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దవగా.. మూడో వన్డే కూడా సగం ఆట మాత్రమే సాగింది. పూర్తిగా జరిగిన రెండో మ్యాచ్‌లో కివీస్ జట్టు ఓటమిపాలైంది. దీంతో 1-0తో సిరీస్ భారత్ వశమైంది. ఈ నేపథ్యంలో వన్డే సిరీస్‌కు రెండు జట్లు సిద్ధం అవుతున్నాయి. ఈ సందర్భంగా వన్డే సిరీస్ ఆరంభానికి ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కివీస్ సారధి కేన్ విలియమ్సన్ పాల్గొన్నాడు.

ఈ మీడియా సమావేశంలో ఐపీఎల్ గురించి కేన్ విలియమ్సన్‌ను కొందరు ప్రశ్నించారు. వచ్చే నెల జరిగే మినీ వేలంలో ఎవరైనా మిమ్మల్ని కొంటారని అనుకుంటున్నారా? అని విలేకరులు అడిగారు. దీనిపై స్పందించిన కేన్ మామ.. 'అదంతా నా చేతుల్లో ఉండదు కదా. ఆ జట్లు తమకు, తమ జట్టుకు ఏం కావాలో దాని కోసం వెతుకుతారు. దాన్ని బట్టే నిర్ణయాలు తీసుకుంటారు. ఇలాంటివన్నీ అలాగే జరుగుతాయి. నేను వెయిట్ చేయడం తప్ప ఏం చెయ్యలేను కదా' అని చెప్పాడు.

మినీ వేలానికి ముందు కేన్ మామను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు వదులుకుంది. తన కెప్టెన్సీలో గతేడాది సన్‌రైజర్స్ పెద్దగా రాణించలేదు. ఆడిన 14 మ్యాచుల్లో కేవలం ఆరింటిలోనే నెగ్గింది. కేన్ మామ కూడా అంతగా రాణించలేదు. జట్టును ముందుండి నడిపించాల్సిన కెప్టెన్ అయ్యుండి.. 19.64 సగటుతో కేవలం 216 పరుగులు మాత్రమే చేశాడు. వీటిలో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. అంటే మిగతా మ్యాచులన్నీ కలిపి కేన్ మామ చేసింది 160+ పరుగులే అన్నమాట. ఇంత పేలవంగా ఆడటంతోనే అతన్ని వదిలించుకోవాలని సన్‌రైజర్స్ నిర్ణయించుకుంది. అతనితోపాటు రూ.10 కోట్లు పెట్టి కొన్న నికోలస్ పూరన్‌ను కూడా వదిలేసింది. అతను కూడా గతేడాది ఐపీఎల్‌లో ఏమాత్రం రాణించలేదు.

Story first published: Thursday, November 24, 2022, 19:22 [IST]
Other articles published on Nov 24, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+