భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ఐసీసీ) ఛైర్మన్‌గా పదవి చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే జై షా ఆ పదవిని అందుకుంటాడా లేదా అనే ఆసక్తి అందరిలో పెరిగింది. శుక్రవారం కొలంబో వేదికగా జరగనున్న ఐసీసీ వార్షిక సమావేశాల్లో దీని గురించి స్పష్టత రానుంది. జులై 19 నుంచి 22వరకు సమావేశాలు జరగనున్నాయి.
ఐసీసీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్‌లో మూడు స్థానాలకు వార్షిక సమావేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాల కోసం పదకొండు మంది పోటీపడుతున్నారు. ఎన్నికైన వాళ్లు రెండేళ్ల కాలపరిమితి కలిగి ఉన్నారు. అయితే సమావేశాల్లో దీంతో పాటు ఐసీసీ కొత్త ఛైర్మన్ గురించి, అలాగే ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్‌కు భారత్ వెళ్తుందా లేదా అనే విషయాలపై చర్చ సాగనుంది.

ఈ ఏడాది నవంబర్‌లో కొత్త ఛైర్మన్‌ను ఎన్నుకుంటారు. ప్రస్తుతం న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్ బార్క్‌లే ఐసీసీ ఛైర్మన్‌గా కొనసాగుతున్నాడు. జై షా ఐసీసీ ఛైర్మన్‌గా పదవి చేపట్టేందకు ఆసక్తి చూపకపోతే బార్క్‌లే 2025 వరకు కొనసాగే అవకాశం ఉంది. ఒకవేళ జైషా పోటీ చేస్తే మాత్రం ఏకగ్రీవంగా ఎన్నికవుతాడు. అయితే బీసీసీఐ అధ్యక్ష పదవిని జై షా అందుకోవాలని భావిస్తే, అంతకంటే ముందు ఐసీసీ ఛైర్మన్‌గా జైషా బాధ్యతలు తప్పక అందుకునే ఛాన్స్ ఉంది.
ఎందుకంటే బీసీసీఐ రాజ్యంగం ప్రకారం జై షా వరుసగా తన బాధ్యతలు కొనసాగించలేడు. ఆరు ఏళ్ల పాటు మాత్రమే కొనసాగే ఛాన్స్ ఉంది. దీంతో బీసీసీఐతో జై షా తప్పక విరామం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఐసీసీ ఛైర్మన్‌గా జైషా బాధ్యతలు అందుకుంటే 2028లో బీసీసీఐ అధ్యక్ష పదవి అందుకోవడానికి అతనికి లైన్ క్లియర్ అవుతుంది. దీంతో బీసీసీఐ రాజ్యంగం ప్రకారం ఎలాంటి అడ్డంకులు ఉండవు. అంతేగాక ఐసీసీ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన అనుభవంతో జైషాకు పెద్దగా పోటీ కూడా ఉండదు. దీంతో జై షా ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు అందుకునే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.