
ఎందుకీ నిషేధం?
విరాట్ కోహ్లీ మనస్తత్వం ఏమిటో మనకు తెలుసు. మ్యాచ్ సందర్భంగా గ్రౌండ్‌లో దూకుడుగా వ్యవహరిస్తాడు. వెనుకా, ముందూ ఏదీ చూడడు. ఏదనిపిస్తే అది చేసేస్తాడు. వికెట్ పడిన ప్రతీసారి తన దూకుడుతనాన్ని ప్రదర్శిస్తుంటారు. బ్యాటింగ్‌లోనూ విరాట్ కోహ్లీది అదే శైలి. లీగ్ మ్యాచ్‌లో భాగంగా బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ అంపైర్‌తో గొడవ పెట్టుకున్న విషయం తెలిసిందే. అదే ఇప్పుడు అతనిపై నిషేధం పడటానికి కారణమైంది.

అంపైర్ మరోసారి వాగ్వివాదం..
బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మహమ్మద్ షమీ ఇన్నింగ్ 12వ ఓవర్‌ను వేశాడు. ఈ సందర్భంగా షమీ వేసిన ఓ గుడ్ లెంగ్త్ బంతి బంగ్లాదేశ్ ఓపెనర్ సౌమ్య సర్కార్ ప్యాడ్లను తాకింది. దీనితో షమీ, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ, కేప్టెన్ విరాట్ కోహ్లీ గట్టిగా అప్పీల్ చేశారు. అంపైర్ మరియాస్ ఎరాస్మస్ స్పందించలేదు. దీనితో- కోహ్లీ ఆయనతో వాగ్వివాదానికి దిగాడు. తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఇది కాస్తా అంపైర్ల ఆగ్రహానికి కారణమైంది. దీనితో అతనిపై ఓ మ్యాచ్‌లో నిషేధం విధించాలని సిఫారసు చేశారు. ప్రపంచకప్ టోర్నమెంట్‌లో విరాట్ కోహ్లీ అంపైర్‌తో వాదులాటకు దిగడం ఇదే తొలిసారి కాదు. ఇదివరకు ఆప్ఘనిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా కూడా అతను అంపైర్‌తో ఇదే తరహాలో వాగ్వివాదానికి దిగాడు.

ఆర్టికల్ 2.1 నియమాన్ని ఉల్లంఘించిన కోహ్లీ..
అంపైర్లతో దురుసుగా ప్రవర్తించాడని, ఇది ఆర్టికల్ 2.1 ప్రకారం ఐసీసీ నిబంధనలకు విరుద్ధం. ఈ స్థాయిలో అప్పీల్ చేయడం, అంపైర్లతో వాగ్వివాదానికి దిగడం వంటి చర్యలు ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం.. తీవ్రమైనదిగా భావిస్తారు. లెవెల్ 1 నిబంధనను ఉల్లంఘించిట్లుగా గుర్తిస్తారు. దీని ప్రకారం.. కోహ్లీపై చర్యలు తీసుకుంది ఐసీసీ. ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌లో దురుసుగా ప్రవర్తించడం వల్ల అతనికి దక్కాల్సిన మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించింది. తాజాగా- బంగ్లాదేశ్‌తోనూ అలాగే ప్రవర్తించడం పట్ల ఓ మ్యాచ్‌లో నిషేధం పడే అవకాశాలు చాలావరకు ఉన్నట్లు తెలుస్తోంది.

అదే జరిగితే..
ఓ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీని నిషేధించడం అంటూ జరిగితే- అది శ్రీలంకతోనే అవుతుంది. శ్రీలంకతో టీమిండియా తన చివరి లీగ్‌మ్యాచ్‌ను ఆడబోతోంది. శనివారం ఈ మ్యాచ్ లీడ్స్‌లోని హెడింగ్లే స్టేడియంలో భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 3 గంలకు ఆరంభం కానుంది. కోహ్లీపై విధించదలచిన నిషేధాన్ని శ్రీలంకతో జరిగే లీగ్ మ్యాచ్ సందర్భంగా అమలు చేయాలని బీసీసీఐ కోరుతోంది. సెమీఫైనల్‌లో విరాట్ కోహ్లీ లేకపోతే- జట్టు బ్యాటింగ్ లైనప్ మొత్తం కకావికలం అయ్యే అవకాశం ఉన్నందున.. వీలైనంత త్వరగా నిషేధాన్ని అమలు చేయాలని అభిప్రాయపడుతోంది.


Click it and Unblock the Notifications












