న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసీస్ పర్యటనలో కోహ్లీ Vs స్టార్క్‌గా పోరు జరగనుందా?: గిల్లీ ఏం చెప్పాడంటే!

India vs Australia 2018-2019 : It's Not About Mitchell Starc vs Virat Kohli | Oneindai Telugu
Will India vs Australia contest be only about Virat Kohli vs Mitchell Starc? Adam Gilchrist opines

హైదరాబాద్: ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి సవాల్ విసిరేందుకు గాను ముగ్గురు ఆసీస్ బౌలర్లు సిద్ధంగా ఉన్నారని ఆ దేశ మాజీ క్రికెట్ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ కవ్వించే ప్రయత్నం చేశాడు. ఇంగ్లాండ్ పర్యటనలో కోహ్లీ, పేసర్ జేమ్స్ అండర్సన్ మధ్య ఆధిపత్య పోరు జరిగింది.ఇప్పుడు కోహ్లీ, పేసర్ మిచెల్ స్టార్క్‌ మధ్య ఆ పోరు జరగనుందా? అని గిల్‌క్రిస్ట్‌ని ప్రశ్నించగా తనదైన శైలిలో సమాధానమిచ్చాడు.

<strong>బీసీసీఐ నుంచి ఊహించని స్పందన: 2014 పర్యాటన నుంచి అర్ధాంతరంగా తప్పుకోవడంపై బ్రావో</strong>బీసీసీఐ నుంచి ఊహించని స్పందన: 2014 పర్యాటన నుంచి అర్ధాంతరంగా తప్పుకోవడంపై బ్రావో

"ఈ పర్యటన‌లో కేవలం విరాట్ కోహ్లీ, మిచెల్ స్టార్క్ మధ్యే ఆధిపత్య పోరు జరగుతుందని నేను అనుకోవట్లేదు. అతనికి మరో ఇద్దరు బౌలర్లు కూడా సవాల్ విసిరేందుకు సిద్ధంగా ఉన్నారు. పాట్ కమిన్స్ ఈ మధ్యకాలంలో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇక హేజిల్‌వుడ్ అయితే.. వేగం, కచ్చితత్వంతో మెక్‌గ్రాత్‌ని తలపిస్తున్నాడు" అని ఆడమ్ గిల్‌క్రిస్ట్ చెప్పుకొచ్చాడు.

"మరోవైపు భారత్ కూడా సూపర్ ఫామ్‌లో ఉన్న కోహ్లీ సిరీస్‌లో భారీగా పరుగులు చేయాలని ఆశిస్తుండొచ్చు. కానీ, ఈ ముగ్గురూ అత్యుత్తమ బౌలర్లు" అని గిల్‌క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మొదటి టీ20 మ్యాచ్‌ నవంబరు 21న ప్రారంభం కానుంది. ఆ దేశ పర్యటన అనంతరం భారత్‌-న్యూజిలాండ్ మధ్య టోర్నీ జరగనుంది.

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేల సుదీర్ఘ సిరీస్‌ని ఆడనుంది. ఆస్ట్రేలియా గడ్డపై ఇప్పటి వరకు ఏ భారత కెప్టెన్ సాధించని ఘనతను అందుకోవాలని విరాట్ కోహ్లీ ఉవ్విళ్లూరుతున్నాడు. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు భారత్ ఒక్క టెస్ట్ సిరీస్‌ను కూడా గెలవలేదు. ఈసారి ఎలాగైనా టెస్ట్ సిరీస్‌ను గెలిచి కెప్టెన్‌గా చరిత్రలో నిలిచిపోవాలని విరాట్ కోహ్లీ చూస్తున్నాడు.

ఆసీస్ పర్యటనలో భారత టీ20 జట్టు:
విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, లోకేశ్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, చాహల్, వాషింగ్టన్ సుందర్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్, ఖలీల్ అహ్మద్

ఆసీస్ పర్యటనలో భారత టెస్ట్ జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), మురళీ విజయ్, లోకేశ్ రాహుల్, పృథ్వీ షా, చతేశ్వర్ పుజారా, ఆజింక్య రహానే, హనుమ విహారి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, పార్థివ్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్

Story first published: Saturday, November 17, 2018, 17:08 [IST]
Other articles published on Nov 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X