Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మూడవ వన్డేలోనైనా ఇండియా ప్రతిభను కనబరుస్తుందా..?

Mahendra Singh Dhoni
ది ఓవల్‌: ప్రపంచ ఛాంపియన్‌గా వరల్డ్ కప్‌ని సొంతం చేసుకొని ఏ ముహుర్తాన ఇంగ్లాండ్‌లో ఇండియా అడుగు పెట్టింది ఏమోగాని అప్పటి నుండి పరజయాలే ఎక్కువగా పలకరిస్తున్నాయి. దీంతో శుక్రవారం ఇంగ్లండ్‌తో జరిగే మూడో వన్డే చావోరేవోగా మారింది. తొలి వన్డే వర్షం వల్ల రద్దుకాగా, రెండో మ్యాచ్‌లో భారత్‌ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఇప్పటికే టెస్టు, టి-20 సిరీస్‌ను కోల్పోయిన ధోనీ సేన ఈ సిరీస్‌లో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేదు. రెండో వన్డేలో భారీ స్కోరు సాధించినా బౌలర్ల వైఫల్యంతో ఓటమి తప్పలేదు. కీలక ఆటగాళ్లందరూ జట్టుకు దూరం కావడంతో భారత్‌ వన్డే సిరీస్‌లో యువ ఆటగాళ్లతో బరిలోకి దిగుతుంది.

ఓపెనర్లు అజ్యంక రహానె, పార్థివ్‌ అద్భుత ఫాంలో ఉన్నారు. తొలి రెండు వన్డేల్లో వీరు మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచారు. ఈ మ్యాచ్‌లో కూడా జట్టు వీరిపైనే ఆశలు పెట్టుకొంది. సెహ్వాగ్‌, సచిన్‌, గంభీర్‌, యువరాజ్‌, రోహిత్‌, జహీర్‌, హర్భజన్‌, ఇషాంత్‌ తదితర స్టార్‌ ఆటగాళ్లు దూరం కావడంతో టీమిండియా బలహీనంగా మారింది. బ్యాటింగ్‌ మెరుగ్గానే కనిపిస్తున్న బౌలింగ్‌ జట్టును కలవర పెడుతోంది. ప్రవీణ్‌, మునాఫ్‌, ఆర్పీ, వినయ్‌ కుమార్‌లు జట్టులో ఉన్నా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ దూకుడును అడ్డుకోలేక పోతున్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సిరీస్‌లో భారత్‌ను గాయలు వెంటాడుతున్నాయి. కీలక ఆటగాళ్లు ఒక్కొక్కరే ఇంటిదారి పట్టుతుండడంతో జట్టు ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. దీంతో మిగితా మూడు వన్డేలు భారత్‌కు సవాలుగా మారాయి. ఇప్పటికే టెస్టు సిరీస్‌ కోల్పోయిన టీమిండియా కనీసం వన్డేల్లోనైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ సిరీస్‌ను దక్కించుకోవాలంటే మిగిలిన మూడు మ్యాచుల్లోనూ విజయం సాధించక తప్పదు.

వరుస పరాజయాలు చవిచూస్తున్న భారత్‌ ఈ మ్యాచ్‌లో తీవ్ర ఒత్తిడితో బరిలోకి దిగుతోంది. భారీ స్కోరును సాధించిన విజయం సాధించక పోవడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. సిరీస్‌ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో గెలవక తప్పదు. ఈ నేపథ్యంలో జట్టుపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. మరోవైపు సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్న ఇంగ్లండ్‌ను ఓడించడం భారత్‌కు అంత సులువుకాదనే విషయం ఇప్పటికే తేలిపోయింది. సీనియర్లలో ద్రవిడ్‌, ధోనీ, రైనా మాత్రమే మిగిలారు. రోహిత్‌, సచిన్‌లు కూడా దూరం కావడంతో జట్టు కష్టాలు మరింత పెరిగాయి. అంతేగాక కెప్టెన్‌ ధోనీ పేలవమైన ఫాం కూడా జట్టును ఆందోళన కలిగిస్తోంది. జట్టును ముందుండి నడిపించడంలో ధోనీ పూర్తిగా విఫలమయ్యాడు.

సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌గా పేరొందిన మహికు ఈ సిరీస్‌లో ఏదీ కలిసి రావడంతో ఒకవైపు వరస ఓటములు, మరోవైపు కీలక ఆటగాళ్ల గాయాలు అతని కష్టాలను రెట్టింపు చేసింది. అంతేగాక, కొత్త కోచ్‌ ఫ్లెచర్‌కు కూడా వన్డే సిరీస్‌ చావోరేవోగా మారింది. వన్డే సిరీస్‌ను కూడా కోల్పోతే కోచ్‌, కెప్టెన్‌లకు ప్రతికూల పరిస్థితి ఎదురు కావడం ఖాయం. ఈ మ్యాచ్‌లో భారత్‌ విజయావకాశాలన్నీ కోహ్లి, పార్థివ్‌, రహానె, రైనాల రాణింపుపైనే ఆధారపడి ఉన్నాయి. అంతేగాక బౌలింగ్‌ కూడా మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఇంగ్లండ్‌ ఈ మ్యాచ్‌లోనూ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+