For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఈ తరానికి కోహ్లీనే అత్యుత్తమ ఆటగాడు: డివిలియర్స్

By Nageshwara Rao

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. క్రికెట్‌లో ఎవరినీ అనుసరించకుండా తనకంటూ ప్రత్యేక శైలి‌ని కోహ్లీ సృష్టించుకున్నాడని అన్నాడు. మోడ్రన్ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ ది బెస్ట్ క్రికెటర్ అని డివిలియర్స్ కొనియాడాడు.

గత వారంలో దక్షిణాఫ్రికా వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న డివిలియర్స్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ కోహ్లీ లాంటి క్రికెటర్‌ని తానెక్కడా చూడలేదని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. 'వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న క్షణం నుంచి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ నిర్ణయంతో నేను మళ్లీ కొత్త ఉత్తేజం పొందిన భావన కలుగుతోంది' అని అన్నాడు.

Will have to work hard to get back into South Africa Test team: AB de Villiers

'నా జీవితం క్రికెట్‌తో మమేకమైపోయింది. అందుకే కెరీర్ చివరిదశలో కూడా ఆటని ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో కెప్టెన్సీని వదులుకున్నా. నా కెరీర్ ఇంకో రెండు లేదా.. గరిష్టంగా మరో ఏడేళ్లు ఉండొచ్చేమో. ఇక వచ్చే ఏడాది భారత్ జట్టు దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్‌ కోసం వస్తోంది. రెండేళ్ల క్రితం మేము భారత్ గడ్డపై ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాం' అని ఏబీ పేర్కొన్నాడు.

'త్వరలో భారత్ దక్షిణాఫ్రికా పర్యటనకు రానుంది. ఈ సిరీస్‌లో మాత్రం వారికి గట్టిపోటీ ఇస్తాం. కోహ్లి తనకంటూ ప్రత్యేక శైలిని సృష్టించుకున్నాడు. నా గురించి కోహ్లీ ఇప్పటికే చాలా సార్లు చెప్పాడు. అయినప్పటికీ అతడే ఈ తరానికి అత్యుత్తమ ఆటగాడు. ఇద్దరం చాలా సరదాగా, ఆటపై అంకితభావంతో గౌరవంగా ఉంటాం' అని ఏబీ తెలిపాడు.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+