For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత బౌలింగ్ దళం బలంగా ఉంది.. చోటు దక్కాలంటే మరింత కష్టపడాలి!!

Will have to work harder to get into Test team says Navdeep Saini

ఢిల్లీ: భారత టెస్టు బౌలింగ్ దళం బలంగా ఉంది. టెస్టు జట్టులో చోటు సంపాదించాలంటే మరింత కష్టపడాలి అని టీమిండియా యువ పేసర్‌ నవ్‌దీప్‌ సైనీ పేర్కొన్నాడు. సైనీ ఆరంగేట్ర మ్యాచ్‌లో విండీస్ బ్యాట్స్‌మెన్‌ను వణికించి కీలక మూడు వికెట్లు తీసి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌'గా ఎంపికయ్యాడు. సెప్టెంబర్ 15 నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌లో సైనీ చోటు దక్కించుకున్నాడు.

చోటు దక్కాలంటే మరింత కష్టపడాలి:

చోటు దక్కాలంటే మరింత కష్టపడాలి:

తాజాగా ఆల్ ఇండియా పబ్లిక్ సెక్టార్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన సందర్భంగా సైనీ మాట్లాడుతూ... 'టెస్టుల్లో భారత బౌలింగ్‌ దళం బలంగా ఉంది. టీ20 సిరీస్‌ ఆడినప్పుడే ఈ విషయం తెలుసుకున్నా. టెస్టు జట్టులోకి రావాలంటే మరింత కష్టపడాలి. భారత టెస్టు జట్టులో చోటు దక్కాలంటే భువనేశ్వర్‌, ఉమేశ్‌, షమీ లాంటి సీనియర్లతో తాను పోటీపడాల్సి ఉంటుందని తెలుసు. అందుకు తగినట్టుగా ప్రాక్టీక్ చేయాలి. షమీ, బుమ్రా, భువనేశ్వర్ వంటి బౌలర్లతో నెట్స్‌లో మాట్లాడినప్పుడు వారి నుండి ఎంతో నేర్చుకున్నా' అని తెలిపాడు.

కోహ్లీ ఎక్కువగా మాట్లాడుతాడు:

కోహ్లీ ఎక్కువగా మాట్లాడుతాడు:

'అంతర్జాతీయ స్థాయిలో తక్కువగా తప్పులు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కువ ప్రాక్టీక్ చేసి తప్పులను సవరించుకుంటున్నా. విరాట్ కోహ్లీ సారథ్యంలో ఆడడం ఎంతో ఉపయోగపడింది. ఒక ఆటగాడు ఎంత అంకితభావంతో ఉండాలో కోహ్లీని చెప్పాడు. ప్రతిసారి కోహ్లీ ఆ విషయం గురించే ఎక్కువగా మాట్లాడుతాడు' అని సైనీ చెప్పాడు.

అరంగేట్రంలోనే అదుర్స్:

అరంగేట్రంలోనే అదుర్స్:

ఇటీవల విండీస్‌తో ముగిసిన టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన సైనీ అద్భుత ప్రదర్శన చేసాడు. ముఖ్యంగా మొదటి మ్యాచ్‌లో విండీస్ బ్యాట్స్‌మెన్‌ను వణికించాడు. తన కోట నాలుగు ఓవర్లలో కేవలం 17 పరుగులు ఇచ్చి కీలక మూడు వికెట్లు తీసి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌'గా ఎంపికయ్యాడు. రెండో మ్యాచ్‌లో వికెట్ ఏమీ తీయకున్నా.. పొదుపుగా బౌలింగ్ చేసాడు. ఇక మూడో మ్యాచ్‌లో 34 పరుగులు ఇచ్చినా.. రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.

జట్టుతో పాటే:

జట్టుతో పాటే:

టీ20 సిరీస్‌లో సైనీ బంతులకు విండీస్ బ్యాట్స్‌మన్‌ ఇబ్బందిపడుతుండంతో.. రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌ కోసం జట్టుతో పాటే అతన్ని కొనసాగించారు. నెట్స్‌లో భారత బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్ చేయడానికి జట్టు యాజమాన్యం అతన్ని జట్టుతో పాటే కొనసాగించింది. సైనీ విండీస్‌ పర్యటనలోని టీ20, వన్డే జట్టులకు మాత్రమే ఎంపికయిన విషయం తెలిసిందే.

Story first published: Friday, September 13, 2019, 13:25 [IST]
Other articles published on Sep 13, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+