
టెస్ట్ సిరిస్‌లో హోరాహోరీ పోరు సాగుతుంది
"టీమిండియాతో టెస్ట్ సిరీస్ హోరాహోరీగా సాగుతుందని భావిస్తున్నాం. ప్రతి టెస్ట్ మ్యాచ్ అతి పెద్ద సవాల్. మమ్మల్ని ఓడించేందుకు వారు ఎంతో కష్టపడాల్సి వచ్చింది. మొదటి టెస్ట్‌లో ఆడిన జట్టుతోనే మేం రెండో టెస్ట్ ఆడబోతున్నాం. తొలి ఇన్నింగ్స్‌లో మేం మరింత పట్టుదలతో ఆడాల్సి ఉంది. మేం భారత్‌కు 210లోపే కట్టడి చేస్తామనుకున్నా 250 వరకు వెళ్లారు" అని అన్నాడు.

తొలి ఇన్నింగ్స్‌లో 15 పరుగులు తక్కువ చేయడం వల్లే
"మేం తొలి ఇన్నింగ్స్‌లో 15 పరుగులు తక్కువ చేయడం మాకు నష్టం కలిగించింది. ఎక్కువ పరుగులు చేసుంటే ఫలితం మరోలా ఉండేది. లోయార్డర్ పోరాటం ఆకట్టుకుంది. నాతోపాటు ట్రావిస్ హెడ్, షాన్ మార్ష్ మరికాసేపు క్రీజులో నిలిస్తే ఫలితం మాకు అనుకూలంగా వచ్చి ఉండేది. భారత్ అద్భుతంగా ఆడింది" అని టిమ్ పైన్ పేర్కొన్నాడు.

ఈ పిచ్‌పై నిలిస్తే పరుగులు వస్తాయి
"విజయానికి వారు పూర్తిగా అర్హులు. ఈ పిచ్‌పై నిలిస్తే పరుగులు వస్తాయని అనుకున్నా మొదటివరుస ఆరుగురిలో ఎవరైనా ఒకరు భారీ ఇన్నింగ్స్ ఆడి ఉండే బాగుండేది. లైయన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతనితో పాటు కమిన్స్, హేజిల్‌వుడ్ కూడా రాణించారు" అని పైన్ తెలిపాడు.

నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో
దీంతో నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. టీమిండియా నిర్దేశించిన 323 పరుగుల లక్ష్యఛేదన కోసం ఓవర్‌నైట్ స్కోరు 104/4తో ఆఖరి రోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా 291 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా(3/68), మహమ్మద్ షమీ(3/65), రవిచంద్రన్ అశ్విన్ (3/92) మూడేసి వికెట్లు తీసి భారత విజయంలో కీలకపాత్ర పోషించారు.

పుజారాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు
ఇషాంత్‌శర్మ(1/48)కు ఒక వికెట్ దక్కింది. షాన్ మార్ష్(60) హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా కెప్టెన్ టిమ్ పైన్(41) ఫర్వాలేదనిపించాడు. చివర్లో నాథన్ లియాన్(38 నాటౌట్) గెలుపుపై ఆశలు రేపాడు. భారత తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ఛటేశ్వర్ పుజారాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. తాజా ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్ట్ గెలవడం భారత్‌కు ఇదే మొదటిసారి


Click it and Unblock the Notifications












