Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పంజాబ్ ఐపీఎల్ విజేతగా నిలిస్తే ఏం చేస్తానంటే: ప్రీతి జింతా

Will do something special if KXIP win IPL 2018, says Preity Zinta

హైదరాబాద్: ఈ ఏడాది కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్ విజేతగా నిలిస్తే జట్టు కోసం ప్రత్యేకంగా ఏదో ఒకటి చేస్తానని చెప్పుకొచ్చింది ఆ జట్టు సహ యజమాని ప్రీతి జింతా. ఐపీఎల్ 11వ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.

గత పదేళ్ల ఐపీఎల్ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇప్పటివరకూ ఒక్కసారిగా కూడా విజేతగా నిలవలేదు. దీంతో ఈ సీజన్‌లోనైనా ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలివాలని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కోరుకుంటోంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓటమి పాలైంది.

కోల్‌కతాపై పంజాబ్ అద్భుత విజయం

కోల్‌కతాపై పంజాబ్ అద్భుత విజయం

టోర్నీలో భాగంగా శనివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రీతి జింతా ఆనందానికి అవధుల్లేకుంటా పోయింది. మ్యాచ్‌ అనంతరం ప్రీతి పంజాబ్‌ జట్టు ఆటగాడు కేఎల్‌ రాహుల్‌తో కలిసి ఐపీఎల్ టీవీతో మాట్లాడింది.

పంజాబ్ కోసం ప్రత్యేకంగా ఏదో ఒకటి చేస్తా

పంజాబ్ కోసం ప్రత్యేకంగా ఏదో ఒకటి చేస్తా

'ఒకవేళ ఈ ఏడాది కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్ విజేతగా నిలిస్తే జట్టు కోసం ప్రత్యేకంగా ఏదో ఒకటి చేస్తా. అదేంటో ఇప్పుడు మాత్రం చెప్పను. ప్రస్తుతం పంజాబ్‌ వరుస మ్యాచ్‌లు గెలుస్తూ దూసుకుపోతోంది. ఇదే విజయ పరంపరను కొనసాగిస్తూ పంజాబ్‌ టోర్నీ విజేతగా నిలవాలి' అని ఆశాభావం వ్యక్తం చేసింది.

పంజాబ్ విజయాల్లో క్రిస్ గేల్ కీలకపాత్ర

పంజాబ్ విజయాల్లో క్రిస్ గేల్ కీలకపాత్ర

ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఒకానొక దశలో వర్షం అంతరాయం కలిగింది. దీంతో మ్యాచ్‌ని 13 ఓవర్లకు కుదించి పంజాబ్ విజయ లక్ష్యాన్ని 125 పరుగులుగా నిర్ధారించారు. దీంతో ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పంజాబ్ విజయాల్లో వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ కీలకపాత్ర పోషిస్తున్నాడు.

తదుపరి మ్యాచ్‌ల్లోనూ ఇదే ప్రదర్శన

తదుపరి మ్యాచ్‌ల్లోనూ ఇదే ప్రదర్శన

మరోవైపు ఓపెనర్ కేఎల్‌ రాహుల్‌ కూడా తనదైన శైలిలో రాణిస్తున్నాడు. టోర్నీలో భాగంగా తదుపరి మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. హైదరాబాద్‌‍తో గురువారం తలపడనుంది. దీంతో తదుపరి మ్యాచ్‌ల్లోనూ ఇదే ప్రదర్శన చేసి ఐపీఎల్ టైటిల్‌ విజేతగా నిలవాలని ఆ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు.

Story first published: Monday, April 23, 2018, 14:51 [IST]
Other articles published on Apr 23, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+