ఢాకా: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న సిరిస్‌లో డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్‌ఎస్) లేకపోవడంపై టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. బీసీసీఐ డీఆర్ఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కోహ్లీ వ్యాఖ్యలు కొంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ఈ డీఆర్ఎస్ విధానంపై త్వరలో టీమ్ సభ్యులతో కలిసి చర్చిస్తానని చెప్పాడు. అటు బౌలర్లు, ఇటు బ్యాట్స్‌మెన్‌లు ఈ నిర్ణయంపై ఏమి అనుకుంటున్నారో కచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.
