
జోహన్నెస్ బర్గ్ టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు బ్యాటింగ్ భారమంతా ప్రస్తుతం వెటరన్ ఆటగాళ్లైనా చటేశ్వర్ పుజారా, అజింక్యా రహానేపైనే పడింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ త్వరగా ఔట్ అవడంతో మ్యాచ్‌లో పుజారా, రహానే బాధ్యత పెరిగింది. వీరిద్దరు ఎన్ని పరుగులు చేస్తారనే దానిపైనే జోహన్నెస్‌బర్గ్ టెస్టు మ్యాచ్‌లో సఫారీలకు టీమిండియా ఎంత టార్గెట్ ఇస్తుందనేది ఆధారపడి ఉంది. అయితే వీరిద్దరు చాలా కాలంగా చెత్త ఫామ్‌లో ఉన్నారు. దీంతో వీరు ఈ ఇన్నింగ్స్‌లో భారీగా పరుగులు చేయగలరా? అనే అనుమానాలే ఎక్కువగా ఉన్నాయి.
ఇప్పటికే దారుణంగా విఫలమవుతున్న పుజారా, రహానేకు ఈ ఇన్నింగ్సే ఇక చివరి అవకాశం అని తెలుస్తోంది. దీంతో ఈ మ్యాచ్‌లో వీరిద్దరు భారీ ఇన్నింగ్స్‌లు ఆడితేనే మ్యాచ్‌తో పాటు వారి కెరీర్‌లు కూడా నిలబడతాయి. లేదంటే టీంలో వారికి ఇక చోటు దక్కకపోవచ్చు. ఇప్పటికే వరుసగా విఫలమవుతున్న వీరిని జట్టులోకి తీసుకుంటుడంపై అంతటా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు బెంచ్‌లో శ్రేయస్ అయ్యర్ వంటి స్టార్ ఆటగాళ్ల రూపంలో గట్టి పోటీ ఉండడంతో ఈ ఇన్నింగ్స్‌లో కనుక రాణించకపోతే కేప్‌టౌన్ టెస్ట్ మ్యాచ్‌లో చోటు కష్టమే అని తెలుస్తోంది. అదే జరిగితే పుజారా, రహానే కెరీర్ ఇక ముగిసినట్టే అని చెప్పుకోవాలి. ఇప్పటికే తొలి ఇన్నింగ్స్‌లో ఇద్దరూ ఘోరంగా విఫలమయ్యారు. అయితే ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే వీరిద్దరు నేడు జరిగే మూడో రోజు ఆటలో భారీ ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును ఆదుకోవడంతోపాటు మంచి అధిక్యం అందించాలి. ప్రస్తుతం క్రీజులో పుజారా 35 పరుగులతో, రహానే 11 పరుగులతో ఉన్నారు.
మరోవైపు జోహన్నెస్‌బర్గ్ టెస్ట్ మ్యాచ్‌లో బౌలర్ల అధిపత్యం కొనసాగుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇరు జట్లు బౌలర్లు విజృంభించడంతో బ్యాటర్లు ఎక్కువగా పరుగులు చేయలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 202, సౌతాఫ్రికా 229 పరుగులకు ఆలౌటయ్యాయి. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత జట్టు రెండు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. ప్రస్తుతం సౌతాఫ్రికాపై భారత్ 58 పరుగుల అధిక్యంలో ఉంది. ఓపెనర్లు రాహుల్ 8, మయాంక్ అగర్వాల్ 23 పరుగులు చేసి ఔట్ అయ్యారు. క్రీజులో పుజారా(35), రహానే(11) ఉన్నారు. కాగా ఇప్పటికే సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో గెలిచిన భారత జట్టు సిరీస్‌లో 1-0తో అధిక్యంలో ఉంది.