తండ్రి కాబోతున్నాడు కాబట్టి.. ఈసారి హార్దిక్‌ 'మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌'గా నిలుస్తాడు: బ్రాడ్‌హాగ్‌

Hardik Pandya Announces Natasa Stankovic's Pregnancy, Virat Kohli Leads Wishes

సిడ్నీ: యూఏఈ వేదికగా సెప్టెంబరు-నవంబరులో ఐపీఎల్ 2020‌ని నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఏర్పాట్లు చేస్తోంది. టోర్నీ ఆతిథ్యానికి సిద్ధంగా ఉండాల్సిందిగా ఇప్పటికే యూఏఈ క్రికెట్ బోర్డుకు లేఖ రాసిన బీసీసీఐ.. టోర్నీలోని జట్ల ఫ్రాంఛైజీలకి కూడా నెల రోజుల ముందే జట్లను అక్కడికి పంపించేలా ప్లాన్ చేసుకోవాలని సూచించింది. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకు ఐపీఎల్ 2020 మ్యాచ్‌లు జరగనున్నాయి.

పాండ్యాకు అదనపు శక్తినిస్తుంది

పాండ్యాకు అదనపు శక్తినిస్తుంది

ఐపీఎల్‌ 2020లో ముంబై ఇండియన్స్‌ స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా 'మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్'‌గా నిలుస్తాడని ఆస్ట్రేలియా మాజీ లెగ్‌ స్పిన్నర్‌ బ్రాడ్‌ హాగ్‌ జోస్యం చెప్పాడు. చాలా రోజుల నుంచి హార్దిక్‌ క్రికెట్‌కు దూరమయ్యాడని, అలాగే త్వరలో తండ్రి కాబోతున్నాడని బ్రాడ్‌ హాగ్‌ గుర్తుచేశాడు. ఆ రెండు కారణాలతో హార్దిక్‌ పాండ్యా అదనపు శక్తి పొందుతాడని, తద్వారా 'మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్''గా ఎంపిక అవుతాడని హాగ్‌ అభిప్రాయపడ్డాడు. తాజాగా తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడిన ఆసీస్ మాజీ స్పిన్నర్‌ ఐపీఎల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

చెన్నైకి దక్కని చోటు

చెన్నైకి దక్కని చోటు

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ ఈసారి కూడా విజేతగా నిలుస్తుందని బ్రాడ్‌ హాగ్‌ చెప్పాడు. ఈసారి రెండు జట్లు హాట్ ‌ఫేవరెట్‌గా బరిలోకి దిగబోతున్నాయని అంచనా వేశాడు. అందులో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లేకపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుండగా.. ఫేవరెట్ లిస్ట్‌లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఉండటం గమనార్హం. ఈ ఏడాది జట్టు ఎంపికలో ఆర్సీబీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందని పేర్కొన్నాడు.

ఐపీఎల్ 2020 టైటిల్ ఫేవరెట్ ముంబై

ఐపీఎల్ 2020 టైటిల్ ఫేవరెట్ ముంబై

'ముంబై జట్టులో తొలి నలుగురు మంచి ఆటగాళ్లు. తర్వాత వచ్చే ఆటగాళ్లు కూడా అత్యుత్తమ ఆల్‌రౌండర్లు. అలాగే వారికి అద్భుతమైన బౌలింగ్ విభాగం ఉంది. డెత్‌ ఓవర్లలో జస్ప్రీత్‌ బుమ్రా, లసిత్‌ మలింగా లాంటి మేటి పేసర్లున్నారు. ముంబై ఇండియన్స్ మరోసారి టైటిల్ గెలుస్తుందని నా అంచనా. నా ఫస్ట్ ఛాయిస్ ముంబై అయితే.. సెకండ్ మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 12 సీజన్లలో బెంగళూరు ఇప్పటివరకూ టైటిల్‌ సాధించలేదు. జట్టుకు మంచి ఆటగాళ్లున్నా ఎప్పుడూ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. కానీ పరిస్థితి ఇప్పుడు అందుకు బిన్నంగా ఉంది' అని బ్రాడ్‌ హాగ్‌ పేర్కొన్నాడు.

ఫించ్ రాకతో

ఫించ్ రాకతో

'ఇన్నేళ్లకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో సమతూకం కనిపిస్తోంది. ఆసీస్ ఓపెనర్ అరోన్ ఫించ్ రాకతో పవర్‌ప్లేలో దూకుడుగా ఆడే బ్యాట్స్‌మెన్ ఆ టీమ్‌కి దొరికాడు. ఫించ్ చాలా త్వరగా పరుగులు చేస్తాడు కాబట్టి తర్వాత బ్యాటింగ్‌ చేసే విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌ లాంటి ఆటగాళ్లపై భారం తగ్గుతుంది. వారు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. బౌలింగ్‌ పరంగానూ డేల్ స్టెయిన్, కేన్ రిచర్డ్‌సన్ రాకతో బలోపేతమైంది. ఈ ఏడాది జట్టు ఎంపికలో ఆర్సీబీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది' అని ఆసీస్ మాజీ స్పిన్నర్ చెప్పాడు. ఎంఎస్ ధోనీ అద్భుతమైన ఆటగాడని, భయం లేకుండా ఆడతాడని పేర్కొన్నాడు. ప్రపంచ క్రికెట్‌లో అతడిని ఎవరూ రీప్లేస్‌ చేయలేరని వ్యాఖ్యానించాడు.

ఒక్కసారి కూడా టైటిల్ విజేతగా నిలవలేదు

ఒక్కసారి కూడా టైటిల్ విజేతగా నిలవలేదు

2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా ముంబై ఇండియన్స్ నాలుగు సార్లు.. చెన్నై సూపర్ కింగ్స్ మూడు సార్లు.. కోల్‌కతా నైట్‌రైడర్స్ రెండు సార్లు.. సన్‌రైజర్స్ హైదరాబాద్, డెక్కన్ ఛార్జర్స్, రాజస్థాన్ రాయల్స్ ఒక్కోసారి టైటిల్ గెలిచాయి. కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ కనీసం ఒక్కసారి కూడా టైటిల్ విజేతగా నిలవలేదు.

ఆ బంతి ఆడకపోయేసరికి.. కోహ్లీ ఓ సాధారణ బ్యాట్స్‌మన్‌ అనుకున్నా: పాక్ పేసర్

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, July 27, 2020, 14:16 [IST]
Other articles published on Jul 27, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X