Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsBAN: బంగ్లాదేశ్‌‌తో ఫాలో ఆన్ ఆడిస్తారా?.. టీమిండియా ప్లాన్ ఏంటి?

Will Bangladesh play follow on or Team India bats for second time

భారత్‌తో ఆడుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ తేలిపోయింది. ఆట మొదలైన రోజున కొంత పట్టు కనబరిచిన బంగ్లా బౌలర్లు ఆ తర్వాత పట్టు కోల్పోయారు. అదే సమయంలో భారత బ్యాటర్లు పట్టుదలగా ఆడి జట్టుకు మంచి స్కోరు అందించారు. ముఖ్యంగా లోయర్ ఆర్డర్ బ్యాటర్లు రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ అద్భుతంగా పోరాడారు. దీంతో భారత జట్టు 404 పరుగులకు ఆలౌట్ అయింది.

బంగ్లా ఫాలో ఆన్ ఆడుతుందా?

బంగ్లా ఫాలో ఆన్ ఆడుతుందా?

భారీ లక్ష్య ఛేదనలో బంగ్లాకు అనుకున్న ఆరంభం లభించలేదు. ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెన్ షాంటో గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా క్రీజులో ఎక్కువ సేపు నిలవలేదు. కుదురుకుంటున్నట్లు కనిపించిన బ్యాటర్లు కూడా చెత్త షాట్లు ఆడి పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇలా వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందుకున్న మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేసి బంగ్లా బ్యాటింగ్ లైనప్‌ను తుత్తునియలు చేశారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లా జట్టు 133 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఫాలో ఆన్ ముప్పులో పడింది. అయితే బంగ్లా చేతి టీమిండియా ఫాల్ ఆన్ ఆడిస్తుందా? లేదా? అని అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

టీమిండియా బ్యాటింగ్ చేస్తుంది..

టీమిండియా బ్యాటింగ్ చేస్తుంది..

దీనిపై టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ మాట్లాడుతూ.. మూడో రోజు ఆట మొదలైన కాసేపటికే మిగతా రెండు వికెట్లను టీమిండియా పేసర్లు తీసేసుకునే ఛాన్స్ ఉందన్నాడు. అయితే బంగ్లాకు ఫాలో ఆన్ ఆడే అవకాశం మాత్రం టీమిండియా ఇవ్వదని, కనీసం ఒక రోజంతా బ్యాటింగ్ చేస్తుందని అంచనా వేశాడు. ఇంకా టెస్టు మ్యాచ్ ముగియడానికి చాలా సమయం ఉన్నందున తక్కువలో తక్కువ ఒక రోజుపాటు భారత జట్టు బ్యాటింగ్ చేస్తుందన్నాడు. దీంతో బంగ్లా ముందు నాలుగో ఇన్నింగ్స్‌లో భారీ లక్ష్యం ఉంటుందని, ఆ ఒత్తిడికి గురైన బంగ్లా బ్యాటర్లను మరోసారి టీమిండియా బౌలర్లు ఉక్కిరిబిక్కిరి చేస్తారని అభిప్రాయపడ్డాడు. అదే సమయంలో బంగ్లా బ్యాటర్ల ఆటతీరుపై కూడా జాఫర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. కొందరు ఆటగాళ్లు అద్భుతమైన డెలివరీలకు అవుటయ్యాడని చెప్పాడు.

వికెట్లు గిఫ్ట్ ఇచ్చేశారేంటి?

వికెట్లు గిఫ్ట్ ఇచ్చేశారేంటి?

తొలి బంతికే అవుటైన షాంటో కూడా అలాంటి డెలివరీకే అవుటయ్యాడని, అయితే మిగతా ఆటగాళ్లలో చాలా మంది అనవసరమైన షాట్లు ఆడి అవుటయ్యారని మండిపడ్డాడు. బంగ్లా బ్యాటర్లలో చాలా మంది తమ వికెట్లను టీమిండియాకు గిఫ్ట్ ఇచ్చారని విమర్శించాడు. తమ వికెట్ విలువైందనే విషయాన్ని బంగ్లా బ్యాటర్లు గ్రహించాలని సలహా ఇచ్చాడు. క్రీజులో కుదురుకున్నట్లు కనిపించిన ఆటగాళ్లు కూడా ఇలా చెత్త షాట్లకు వికెట్లు పారేసుకోవడం ఏంటని ప్రశ్నించాడు. బ్యాటర్లు పరుగులు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా ఎక్కువ సేపు క్రీజులో ఉండటానికి ప్రయత్నించాలని సూచించాడు. మరి మూడో రోజున బంగ్లా ఆటగాళ్లు ఎలా ఆడతారో చూడాలి.

Story first published: Friday, December 16, 2022, 10:03 [IST]
Other articles published on Dec 16, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+