క్రికెట్‌లో 'వైడ్ గ్యాప్' అద్భుతం: ఒక్క మ్యాచ్‌లో 136 వైడ్లు
హైదరాబాద్: క్రికెట్‌లో అద్భుతం చోటు చేసుకుంది. ఒక్క మ్యాచ్‌లో 136 వైడ్ బాల్స్ నమోదు అయ్యాయి. నాగాలాండ్, మణిపూర్ జట్ల మధ్య బుధవారం అండర్-19 మహిళల వన్డే మ్యాచ్‌ను బీసీసీఐ నిర్వహించింది. ఈ మ్యాచ్‌లో మణిపూర్ 94 వైడ్లు వేయగా నాగాలాండ్ 42 వేసింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నాగాలాండ్ 38 ఓవర్లకు గాను 215 పరుగులు చేసి ఆలౌటైంది. అందులో 94 వైడ్లతో కలిపి 112 అదనపు పరుగులున్నాయి. ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరును సాధించారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన మణిపూర్ మహిళల జట్టు 27.3 ఓవర్లలో 94 పరుగులకు ఆలౌటైంది.

ఈ ఇన్నింగ్స్‌లో నాగాలాండ్ 42 వైడ్లు వేసింది. దీంతో ఈ మ్యాచ్‌లో నాగాలాండ్ 117 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ ధన్‌బాద్‌లోని నెహ్రూ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌ను వీక్షించిన బీసీసీఐ అధికారులు ఈశాన్య రాష్ట్రాలు క్రికెట్‌లో చాలా అభివృద్ధి సాధించాల్సి ఉందని అభిప్రాయ పడ్డారు.
అనంతరం మాట్లాడుతూ తాము వైడ్ల గురించి ఆలోచించడం లేదని ఇతర జట్లతో ఉన్న అంతరం (వైడ్ గ్యాప్) గురించి బాధ పడుతున్నామని అన్నారు. ఈ ప్రాంతంలో క్రికెట్ మౌలిక వసతులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని క్రికెట్ నిపుణులు ఈ సందర్భంగా చెప్పారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications