Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వాళ్ల వికెట్ల తీయడమే నాకు సంతృప్తినిచ్చింది: రషీద్ ఖాన్

Wickets of AB, Dhoni, Virat Kohli are the best of my career: Rashid Khan

హైదరాబాద్: ఐపీఎల్ 2018 సీజన్‌లో బౌలర్‌గానే కాకుండా, ఆల్ రౌండర్‌గానూ అద్భుత ప్రదర్శన చేసి ఆకట్టుకున్న ఆటగాడు రషీద్ ఖాన్. బౌలర్‌గా ఈ ఐపీఎల్ 21 వికెట్లు తీశాడు. దీంతో ఈ సీజన్‌కు గాను అత్యధిక వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ 2018 గురించి రషీద్ ఇలా స్పందించాడు. మహేంద్రసింగ్ ధోనీ, విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్ వికెట్లు తీయడం తనకు ఎక్కువ సంతృప్తినిచ్చిందని సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పిన్నర్ రషీద్ ఖాన్ వెల్లడించాడు.

గత ఆదివారం హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొందిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మూడోసారి ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. టోర్నీ ఆరంభం నుంచి సన్‌రైజర్స్ జట్టు బౌలింగ్‌ భారాన్ని మోస్తూ వచ్చిన రషీద్ ఖాన్.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ రాణించి ఒంటిచేత్తో జట్టుని ఫైనల్‌కి చేర్చాడు.

కానీ.. ఫైనల్లో జట్టు ఓడిపోవడం బాధించినా.. టోర్నీలో తన ప్రదర్శనపై ఈ అఫ్గానిస్థాన్ స్పిన్నర్ సంతృప్తి వ్యక్తం చేశాడు. టోర్నీలో విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌తో పాటు మహేంద్రసింగ్ ధోనీ వికెట్ తీయడం ఎక్కువ సంతృప్తినిచ్చిందన్నాడు. తన కెరీర్‌లో వీరి వికెట్లే బెస్ట్‌ అని భావిస్తున్నానని తెలిపాడు.

ఎందుకంటే ఆ ముగ్గురు క్రికెటర్లూ.. స్పిన్‌ బౌలింగ్‌‌ని సమర్థంగా ఎదుర్కోగలరు. అలాంటి వారిని ఔట్ చేయడం కెరీర్‌లో ఓ మధుర జ్ఞాపకంగా భావిస్తానని అని రషీద్ ఖాన్ వెల్లడించాడు. ఐపీఎల్ 2018 సీజన్‌లో మొత్తం 17 మ్యాచ్‌లాడిన రషీద్ ఖాన్ 21 వికెట్లు పడగొట్టాడు. అతని ఎకానమీ 6.73 మాత్రమేకాగా.. బెస్ట్ 3/19గా ఉండటం విశేషం.

Story first published: Tuesday, May 29, 2018, 12:57 [IST]
Other articles published on May 29, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+