Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అరె మియా! వీడికి గ‌రం గ‌రం చాయ్ చెప్పండ్రా! పాక్ కేప్టెన్ ఆవ‌లింత‌ల‌పై జోకుల ఫిరంగులు!

Wicket keeper or Sleep keeper, memes tides on Pakistan skipper Sarfaraz trolled for yawning

మాంఛెస్ట‌ర్‌: అస‌లే భార‌త్‌తో మ్యాచ్‌. రెండు దేశాల్లో కోట్లాదిమంది అభిమానుల మ‌నోభావాలు, ఉద్విగ్న‌త‌ల‌తో ముడిప‌డిన మ్యాచ్‌. ప్ర‌పంచ‌క‌ప్‌లో ఒక్క‌సారి కూడా టీమిండియాపై గెల‌వ‌ని అతి చెత్త రికార్డు. దాన్ని బ‌ద్ద‌లు కొట్ట‌డానికి దొరికిన ఛాన్స్‌. ఇలాంటి మ్యాచ్‌లో పాకిస్తాన్ జ‌ట్టు కేప్టెన్ ఎలా ఉండాలి? పేల‌డానికి సిద్ధంగా ఉన్న ఫిరంగిలా ఉండాలి? విల్లు నుంచి దూసుకెళ్లే బాణంలో ఉండాలి? ఫీల్డింగ్ మోహ‌రింపుతో భార‌త బ్యాట్స్‌మెన్‌ను క‌ట్ట‌డి చేయాలి. బుర్ర‌ను పాద‌ర‌సంలా ప‌రుగెత్తించాలి. క‌దా! మ‌రి ఓల్డ్ ట్రాఫొర్డ్ మ్యాచ్‌లో జ‌రిగిందేమిటీ? క‌నీసం పోటీ కూడా ఇవ్వ‌లేక‌పోయింది పాకిస్తాన్‌. బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో దారుణంగా విఫ‌ల‌మైంది. 89 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది.

ఒక్క ఆవ‌లింత‌.. మ్యాచ్ మూడ్‌ను మార్చేసింది!

పరాజ‌యం సంగ‌తి ప‌క్క‌న పెడితే..పాకిస్తాన్ కేప్టెన్ స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్ ఒక్క ఆవ‌లింత అత‌నికి ఈ మ్యాచ్‌పై ఉన్న నిరాస‌క్తిని స్ప‌ష్టం చేసింది. వికెట్ల వెనుక ఉంటూ అత‌ను చేసిన ఆవ‌లింతను చూసిన అభిమానులు న‌వ్వుకున్నారు. త‌మ సృజ‌నాత్మకు ప‌దును పెట్టారు. మెమెల‌తో విరుచుకు ప‌డుతున్నారు. ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్ వంటి సోష‌ల్ మీడియాలో స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్ ఆవ‌లింత‌ల వ్య‌వ‌హారం ట్రెండింగ్‌లో ఉందంటే.. అత‌ని ఆవ‌లింత ఎంత ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

వేడి వేడి ఛాయ్‌, స‌మోసా!

మాంఛెస్ట‌ర్‌లో ఆదివారం నాటి వాతావ‌ర‌ణం ఎలా ఉందో మ‌న‌కు తెలుసు? ఆకాశం మ‌బ్బులు ప‌ట్టి క‌నిపించింది. అప్పుడప్పుడు వీచే ఈదురుగాలులు.. వాతావ‌ర‌ణాన్ని చ‌ల్ల‌బ‌రిచాయి. మ్యాచ్ వాడి, వేడిగా కొన‌సాగుతున్న స‌మ‌యానికి మాంఛెస్ట‌ర్‌లో 16 డిగ్రీలు మాత్ర‌మే గ‌రిష్ఠ ఉష్ణోగ్ర‌త న‌మోదైంది. బాల్క‌నీలో కూర్చుని వేడి వేడి ఛాయ్ సిప్ చేస్తూ, బ‌జ్జీల‌ను తినాల‌నిపించేలా క‌నిపించిన వాతావ‌ర‌ణం అంది. బ‌హుశా- స‌ర్ఫ‌రాజ్‌కు కూడా అదే అనిపించి ఉంటుంది. అలాంటి జ్ఞాప‌కాలే అత‌ణ్ని ఆవ‌హించి ఉండొచ్చు. అందుకే- ఆవ‌లిస్తూ ఛాయ్ కోసం ఎదురు చూస్తున్న‌ట్టుగా ఉన్నాడ‌ని జోకులు పేలుస్తున్నారు నెటిజ‌న్లు.

మెమెల‌తో ఆడుకుంటున్న ట్విట్ట‌ర‌ట్టీస్‌

టీమిండియా అభిమానులు పాక్‌పై మెమెల‌ను సృష్టించ‌డానికి ఎప్పుడెప్పుడా? అని కాచుకుని కూర్చుని ఉంటారు. ఇక ల‌డ్డూలాంటి ఈ అవకాశాన్ని ఎంత మాత్ర‌మూ జార విడుచుకోరు. స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్ ఆవ‌లింత‌ల ఫొటోలు, స్క్రీన్ షాట్ల‌తో మెమెల‌ను సృష్టించి, సోష‌ల్ మీడియాలో నింపేశారు. ఈ ర‌కంగానైనా స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్‌ను టాప్ ట్రెండింగ్‌లో నిలిపారు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఘోరంగా ప‌రాజ‌యం పాలైంది. 89 ప‌రుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది. దీనితో పాకిస్తాన్ పాయింట్ల ప‌ట్టిక‌లో రెండోస్థానంలో నిలిచింది చివ‌రినుంచి. అయిదు మ్యాచుల్లో ఒక్క‌టి మాత్ర‌మే గెలిచింది స‌ర్ఫ‌రాజ్ టీమ్. మ‌రో మ్యాచ్ ర‌ద్దు కాగా, మూడింట్లో ఓడిపోయింది.

మూడోస్థానానికి ఎగ‌బాకిన టీమిండియా

మాంఛెస్ట‌ర్‌లో పాకిస్తాన్‌పై ఘ‌న విజ‌యం సాధించ‌డంతో టీమిండియా పాయింట్ల ప‌ట్టిక‌లో మూడోస్థానానికి ఎగ‌బాకింది. ఈ మ్యాచ్‌తో టీమిండియా ఏడు పాయింట్ల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో మూడోస్థానంలో నిలిచింది. ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడింట నెగ్గింది. న్యూజీలాండ్‌తో జ‌ర‌గాల్సిన మ్యాచ్ వ‌ల్ల ర‌ద్ద‌యిన విష‌యం తెలిసిందే. ఆస్ట్రేలియా అగ్ర‌స్థానంలో కొన‌సాగుతుండ‌గా.. న్యూజీలాండ్ రెండోస్థానంలో నిలిచింది. నాలుగు మ్యాచ్‌లు ఆడి, నాలుగింట్లోనూ ఓడిపోయిన ఆఫ్ఘ‌నిస్తాన్ చిట్ట‌చివ‌రి స్థానంలో నిలిచింది.

Story first published: Monday, June 17, 2019, 8:39 [IST]
Other articles published on Jun 17, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+