Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆసీస్‌పై ఘన విజయం: ధోనీ ప్రపంచ రికార్డు

మెల్బోర్న్: భారత పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టు కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ మరో ప్రపంచ రికార్డు సృష్టించాడు. శుక్రవారం మెల్బోర్న్‌లో ఆస్ట్రేలియాపై రెండో ట్వంటీ20 మ్యాచులో విజయం సాధించడంతో ఆ రికార్డు ఆయన సొంతమైంది.

రవీంద్ర జడేజా బౌలింగులో ఫౌల్కనర్‌ను స్టంపవుట్ చేయడం ద్వారా ధోనీ ఆ రికార్డు సాధించాడు. అన్ని ఫార్మాట్లలో అత్యధిక స్టంపవుట్లు చేసిన ప్రపంచ రికార్డు ధోనీ వశమైంది. ఇప్పటి వరకు ధోనీ 140 స్టంపవుట్లు చేయగా, శ్రీలంక వికెట్ కీపర్ కుమార్ సంగక్కర 139 స్టంపవుట్లు చేశాడు.

ఫౌల్కనర్ బ్యాట్‌ అంచును బంతి ముద్దాడి ధోనీ చేతుల దాకా వచ్చి ప్యాడ్స్‌కు తాకి స్టంప్స్‌ను కూల్చింది. ఆ సమయంలో ఫౌల్కనర్ క్రీజు వెలుపల ఉన్నాడు. శుక్రవారంనాడు ధోనీ రెండు స్టంపవుట్లు చేశాడు. దీనికి ముందు యువరాజ్ సింగ్ వేసిన బంతితో మాక్స్‌వెల్‌ను స్టంపవుట్ చేశాడు.

Wicket keeper MS Dhoni sets world record in Melbourne

అత్యధిక స్టంపవుట్లు చేసిన వికెట్ కీపర్లు

140- ఎంఎస్ ధోనీ (ఇండియా)
139 - కుమార్ సంగక్కర (శ్రీలంక)
101 - రొమేష్ కులవితరణ (శ్రీలంక)
93 - మోయిన్ ఖాన్ (పాకిస్తాన్)
92 - ఆడమ్ గిల్‌క్రిస్ట్ (ఆస్ట్రేలియా)

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+