Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఓవర్ త్రో.. వికెట్లను బదులు బౌలర్‌ని కొట్టిన కీపర్‌ (వీడియో)

Wicket Keeper Hits Bowler While Attempting A Run Out In T20 Blast

హైదరాబాద్: క్రికెట్ మ్యాచ్ అంటే బ్యాట్, బంతి మధ్య పోటీ కాకుండా కొన్ని వింతైన ఆన్-ఫీల్డ్ సంఘటనలు కూడా జరుగుతాయి. ఆటగాళ్లు ఒక్కోసారి అనుకోకుండా చేసే తప్పిదాల వలన ఈ ఘటనలు చోటుచేసుకుంటాయి. అలాంటి కొన్నిటిని చూస్తే పడి పడి నవ్వుకుంటారు. ఇంగ్లాండ్‌లో జరుగుతున్న నార్త్‌ గ్రూప్స్‌ విటాలిటీ బ్లాస్ట్ టీ20 లీగ్‌లో ఇలాంటి ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది.

బౌలర్‌కు తాకినా బంతి:

బౌలర్‌కు తాకినా బంతి:

నార్త్‌ గ్రూప్స్‌ విటాలిటీ బ్లాస్ట్ టీ20 లీగ్‌లో భాగంగా డ్యూరమ్‌, యార్క్‌షైర్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. యార్క్‌షైర్‌ జట్టు సభ్యుడు, దక్షిణాఫ్రికాకు చెందిన బౌలర్‌ కేశవ్‌ మహరాజ్‌ బౌలింగ్‌ చేస్తున్నాడు. కేశవ్‌ విసిరిన బంతికి క్రీజులో ఉన్న బ్యాట్స్‌మన్‌ సింగిల్‌కు ప్రయత్నించాడు. బంతి బ్యాట్‌కు తగలకపోయినప్పటికీ.. ఇద్దరు సింగిల్‌ కోసం పరిగెత్తారు. దీంతో కీపర్‌ జోనాథన్ టాటర్‌సాల్ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి బంతిని అందుకుని రన్‌ఔట్‌ చేసేందుకు విసిరాడు. బంతి కాస్తా వికెట్లకు తగలకుండా బౌలర్‌ తొడకు గట్టిగా తగిలింది. బౌలర్‌ వెంటనే నొప్పికి భరించలేక రాసుకుంటూ పరిగెత్తాడు.

పగతో బంతిని బలంగా విసిరాడు:

దీనికి సంబందించిన వీడియోను విటాలిటీ బ్లాస్ట్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 'ది పూర్ బౌలర్' అనే కాప్షన్ రాసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన వారు నవ్వులు పూయిస్తున్నారు. అంతేకాదు చమత్కారంగా కామెంట్లు చేశారు. ఏదో పగతో బంతిని అంత బలంగా విసిరినట్లు అనిపిస్తుంది అని కామెంట్లు చేస్తున్నారు. మీరు ఓ సారి చూడండి. చూస్తే మాత్రం నవ్వు ఆపుకొలేరు. మహరాజ్‌ నొప్పికి భరించలేక తొడను రాసుకుంటూ పరుగెత్తడం హైలెట్.

జాక్ షట్ 5 వికెట్లు:

జాక్ షట్ 5 వికెట్లు:

దెబ్బతిన్నప్పటికీ మహారాజ్ తన నాలుగు ఓవర్ల పూర్తి కోటాను పూర్తిచేయగలిగాడు. కానీ.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. మొదటగా బ్యాటింగ్ చేసిన యార్క్‌షైర్ 146 పరుగులు చేసింది. కెప్టెన్ టామ్ (52) అర్ధ సెంచరీ చేసాడు. జాక్ లీనింగ్ (39 బంతుల్లో 39), టిమ్ బ్రెస్నన్ ఐదు బంతుల్లో 14 పరుగులు చేసారు. 147 పరుగుల లక్ష్య ఛేదనలో డి ఆర్సీ షార్ట్, స్కాట్ స్టీల్ 70 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే యార్క్‌షైర్‌ ఆఫ్‌బ్రేక్ బౌలర్ జాక్ షట్ 5 వికెట్లు తీయడంతో 132 పరుగులకు డ్యూరమ్‌ ఆలౌట్ అయింది. యార్క్‌షైర్‌ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Story first published: Tuesday, August 27, 2019, 10:39 [IST]
Other articles published on Aug 27, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+