న్యూఢిల్లీ: జీతభత్యాల విషయంలో గతంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు(డబ్యూఐసీబీ)కి ఆటగాళ్లకు మధ్య విభేదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు బోర్డు మాట విన్న ఆటగాళ్లకు పెద్దపీట వేసి, కీలకమైన ఆటగాళ్లను పక్కుకు పెట్టిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా వెస్టిండిస్ క్రికెట్ బోర్డు మరో వివాదంలో తలదూర్చింది. వెస్టిండిస్‌కు చెందిన క్రికెటర్లు విదేశీ లీగ్‌లు ఆడితే అందులో 20 శాతం సొమ్మును తమకు చెల్లించాలంటూ వెస్టిండిస్ బోర్డు కొత్త నిబంధనను విధించింది.
వెస్టిండిస్‌కు చెందిన ఆటగాడు తమ దేశానికి బయట జరిగే ట్వంటీ 20 టోర్నమెంట్‌లో పాల్గొంటే అందులోని 20 శాతం సొమ్మును బోర్డుకు చెల్లించాలంటూ నిబంధన పెట్టింది. అలా అయితేనే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్‌ఓసీ) ఇస్తామని స్పష్టం చేసింది.
తాజా నిర్ణయంతో దక్షిణాఫ్రికా ట్వంటీ 20 లీగ్ రామ్ స్లామ్‌లో ఆడేందుకు గాను రెం

అంతేకాదు వెస్టిండిస్ జాతీయ జట్టులో ఉన్న ఆటగాళ్లు ఎవరైనా విదేశీ లీగ్‌లో ఆడటానికి వెళ్లే ముందు 20 శాతం ఫీజును చెల్లించడానికి అంగీకరించి ఎన్ఓసీ తీసుకోవాలని అందులో పేర్కొంది. దీంతో త్వరలో దక్షిణాఫ్రికాలో జరిగే ఆ లీగ్‌లో పొలార్డ్ పాల్గొనే అవకాశాలు కనిపించడం లేదు.