వాంఖడేలో పరుగుల సునామీ.. లంక రికార్డుకు తృటిలో తప్పిన ముప్పు!
T20 World Cup 2026: ముంబైలోన వాంఖడే స్టేడియంలో వెస్టిండీస్ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. జింబాబ్వేతో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోరు సాధించింది. కేవలం 34 బంతుల్లోనే 85 పరుగులు చేసినషిమ్రాన్ హెట్మెయర్ మెరుపు దాడితో రికార్డుల వేట మొదలైంది. తృటిలో సెంచరీ చేజార్చుకున్నప్పటికీ జట్టును భారీ స్కోరు వైపు నడిపించాడు. ఈ ఇన్నింగ్స్‌లో నమోదైన 5 ప్రధాన రికార్డులు ఇవే.
1. జింబాబ్వేపై అత్యధిక స్కోరు
వెస్టిండీస్ సాధించిన 254 పరుగులు, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో జింబాబ్వేపై నమోదైన అత్యధిక స్కోరు. గతంలో (2023లో) భారత్ 234 పరుగులు సాధించగా.. నేడు విండీస్ ఆ రికార్డును తిరగరాసింది.

2. ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు
ఈ ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ బ్యాటర్లు ఏకంగా 19 సిక్సర్లు బాదారు. దీంతో టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్టుగా నెదర్లాండ్స్ (2014లో ఐర్లాండ్‌పై 19 సిక్సర్లు) రికార్డును వెస్టిండీస్ సమం చేసింది.
3. టీ20 వరల్డ్ కప్‌లో రెండో అత్యధిక స్కోరు
ప్రపంచకప్ చరిత్రలో 250 పరుగుల మార్కును దాటడం ఇది రెండోసారి మాత్రమే. 2007లో కెన్యాపై శ్రీలంక (260/6) సాధించిన స్కోరే ఇప్పటికీ ప్రథమ స్థానంలో ఉండగా.. వెస్టిండీస్ ఇప్పుడు 254 పరుగులతో రెండో స్థానానికి చేరింది.
4. హెట్మెయర్ స్ట్రైక్ రేట్ రికార్డు
హెట్మెయర్ 250 స్ట్రైక్ రేట్‌తో (34 బంతుల్లో 85) బ్యాటింగ్ చేశాడు. 30 కంటే ఎక్కువ బంతులు ఆడిన బ్యాటర్లలో టీ20 ప్రపంచకప్‌లో ఇదే అత్యుత్తమ స్ట్రైక్ రేట్. గతంలో ఆరోన్ జోన్స్ (235 స్ట్రైక్ రేట్) పేరిట ఉన్న రికార్డును హెట్మెయర్ అధిగమించాడు.
5. వెస్టిండీస్ తరపున వేగవంతమైన హాఫ్ సెంచరీ
హెట్మెయర్ కేవలం 19 బంతుల్లోనే తన అర్థ సెంచరీని పూర్తి చేశాడు. టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ తరపున ఇదే అత్యంత వేగవంతమైన ఫిఫ్టీ. గతంలో క్రిస్ గేల్ (2009లో ఆస్ట్రేలియాపై 23 బంతుల్లో) పేరిట ఉన్న రికార్డును హెట్మెయర్ చెరిపివేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications