For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WI vs SL: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. కుమార ఔట్.. బినూర ఫెర్నాండో ఇన్!!

WI vs SL Playing 11 is Out: Lahiru Kumara is out and Binura Fernando in for Sri Lanka

అబుదాబి: టీ20 ప్రపంచకప్‌ 2021 సూపర్ 12లో భాగంగా అబుదాబి వేదికగా మరో కొద్దిసేప‌ట్లో శ్రీలంక‌, వెస్టిండీస్ మ‌ధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో శ్రీలంక ముందు బ్యాటింగ్‌కు దిగ‌నుంది. వెస్టిండీస్ టీమ్‌లో ఎటువంటి మార్పు లేదని పొలార్డ్ తెలిపాడు. మరోవైపు శ్రీలంక జట్టులో ఒక మార్పు చోటు చేసుకుందని ఆ జట్టు సారథి దాసున్ శనక పేర్కొన్నాడు. లాహిరు కుమార స్థానంలో బినుర ఫెర్నాండోను లంక తుది జట్టులోకి తీసుకుంది.

శ్రీలంక‌, వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్ అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో జరగనుంది. సాయంత్రం 7:30 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభమౌతుంది. రెండు జట్లకూ ఈ మ్యాచ్ అగ్నిపరీక్ష లాంటిది. ఓడిన జట్లు ఇంటిదారి పట్టాల్సి ఉంటుంది. నాలుగు మ్యాచ్‌లల్లో ఒకదాంట్లో మాత్రమే గెలిచిన శ్రీలంక.. మూడు మ్యాచ్‌లల్లో ఒక దాంట్లోనే నెగ్గిన విండీస్ తలపనున్నాయి. శ్రీలంకతో సహా మరో మ్యాచ్‌ ఆడాల్సి ఉంది విండీస్. ఈ రెండింట్లోనూ భారీ తేడాతో గెలిస్తే.. తప్ప టోర్నమెంట్‌లో ముందకు వెళ్లలేని పరిస్థితి. శ్రీలంక జట్టు పరిస్థితి బాగుందనుకోవడానికీ ఏ మాత్రం వీల్లేదు. వెస్టిండీస్‌కు భిన్నంగా ఏమీ ఉండట్లేదు.

తుది జట్లు:
వెస్టిండీస్: క్రిస్ గేల్‌, ఎవిన్ లీవిస్‌, రోస్ట‌న్ చేజ్‌, నికోల‌స్ పూర‌న్‌ (వికెట్ కీప‌ర్‌), సిమ్రోన్‌ హెట్‌మైర్‌, కైరోన్ పొలార్డ్‌ (కెప్టెన్‌), ఆండ్రీ ర‌సెల్‌, జ‌స‌న్ హోల్డ‌ర్‌, డ్వేన్ బ్రావో, అకీల్ హోసీన్, ర‌వి రాంపాల్.
శ్రీలంక: పాథ‌మ్ నిస్సాంక‌, కుశాల్ పెరీరా (వికెట్ కీప‌ర్‌), చ‌రిత్ అస‌లంక‌, అవిష్క ఫెర్నాండో, భానుకా రాజ‌ప‌క్సా, దాసున్ శ‌న‌క‌ (కెప్టెన్‌), చ‌మిక క‌రుణర‌త్నే, వానిండు హ‌స‌రంగ‌, దుష్మంత చ‌మీరా, మ‌హీశ్ తీక్ష‌ణ‌, బినురా ఫెర్నాండో.

Story first published: Thursday, November 4, 2021, 19:39 [IST]
Other articles published on Nov 4, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+