Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లెజెండర్ల లిస్ట్‌లో పాకిస్తాన్ బౌలర్ షహీన్ అఫ్రిది: నాటకీయ పరిణామాల మధ్య గ్రాండ్ విక్టరీ

WI vs PAK: Shaheen Afridi’s 10-wicket haul guide to win, Pakistan levelled the series 1-1

కింగ్స్‌టన్: వెస్టిండీస్-పాకిస్తాన్ మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ నాటకీయ పరిణామాల మధ్య ముగిసింది. పాకిస్తాన్ 109 పరుగుల తేడాతో గెలిచిందీ మ్యాచ్‌లో.ఈ మ్యాచ్‌ మొత్తం బౌలర్లదే ఆధిపత్యం. రెండు జట్లలోనూ బౌలర్లు రాజ్యమేలారు. బ్యాట్స్‌మెన్లను కట్టి పడేశారు. పాకిస్తాన్ తొలి ఇన్నింగ్‌లో ఫవాద్ ఆలమ్ సెంచరీ, కేప్టెన్ బాబర్ ఆజమ్ అర్ధసెంచరీ మినహా మరెవరూ భారీ స్కోర్లను సాధించలేకపోవడం బౌలర్ల పెత్తనాన్ని చాటి చెబుతోంది. మ్యాచ్‌ ఫలితం తేలేలా చేసింది కూడా బౌలర్లే. పాకిస్తాన్ 109 పరుగుల తేడాతో గెలిచిందీ మ్యాచ్‌లో.

సిరీస్ సమం

సిరీస్ సమం

కింగ్స్‌టన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో సాధించిన విజయంతో పాకిస్తాన్.. రెండు టెస్ట్‌ల సిరీస్‌ను సమం చేసింది. తొలి టెస్ట్‌లో వెస్టిండీస్ వీరుల చేతుల్లో ఓడిపోయిన తరువాత.. ఇంత త్వరగా ఆ జట్టు కోలుకుంటుందని ఎవరూ ఊహించి ఉండరు. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్‌‌లో బ్యాటింగ్ కూడా నాసిరకంగా సాగింది. ఓపెనర్లు అబిద్ అలి, ఇమ్రాన్ బట్ ఒక్కో పరుగు చేసి అవుట్ అయ్యారు. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ అజర్ అలీ సున్నాకే పెవిలియన్ చేరాడు. రెండు పరుగులకే మూడు వికెట్లను కోల్పోయిన పాకిస్తాన్ జట్టు.. చివరికి మ్యాచ్‌ను గెలిచిందంటే ఎవరికీ నమ్మశక్యం కూడా కాదు. ఆ ఘనత మాత్రం బౌలర్లదే.

సెంచరీతో మెరిసిన ఫవాద్

సెంచరీతో మెరిసిన ఫవాద్

కేప్టెన్ బాబర్ ఆజమ్, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఫవాద్ ఆలమ్ తప్ప పాకిస్తాన్ జట్టులో ఎవ్వరూ రాణించలేకపోయారు.. సత్తా చాటలేకపోయారు. ఫవాద్ ఆలమ్ 124 పరుగులు, బాబర్ ఆజమ్ 75 పరుగులతో కేప్టెన్సీ నాక్ ఆడటంతో పోరాడదగ్గ స్కోర్‌ చేసింది పాకిస్తాన్. లోయర్ ఆర్డర్‌లో మహ్మద్ రిజ్వాన్-31, ఫహీమ్ అష్రాఫ్- 26, షహీన్ షా అఫ్రిది-19 పరుగులు చేశారు. దీనితో తొలి ఇన్నింగ్‌లో 302 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కీమర్ రోచ్, జేడెన్ సీల్స్ తలో మూడు వికెట్లు తీసుకున్నారు. జేసన్ హోల్డర్ రెండు వికెట్లు పడగొట్టాడు.

వెస్టిండీస్ వెన్ను విరిచిన షహీన్..

వెస్టిండీస్ తొలి ఇన్నింగ్ కూడా దీనికి భిన్నంగా ఏమీ సాగలేదు.. పైగా మరింత అధ్వాన్నంగా కనిపించింది. షహీన్ షా అఫ్రిది బౌలింగ్ ధాటికి ఎవ్వరూ క్రీజ్‌లో నిల్చోలేకపోయారు. ఒకరివెంట ఒకరు పెవిలియన్ బాట పట్టారు. 37 పరుగులు చేసిన బోనర్ ఒక్కడే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జెర్మెన్ బ్లాక్‌వుడ్ 33, జేసన్ హోల్డర్ 26 పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్‌లో షహీన్ షా అఫ్రిది ఏకంగా ఆరుమందిని పెవిలియన్ చేర్చాడు. క్రెగ్ బ్రేత్‌వైట్, కీరన్ పావెల్, అల్జరీ జోసెఫ్, బ్లాక్‌వుడ్, జేసన్ హోల్డర్, కీమర్ రోచ్‌లను అవుట్ చేశాడు. 150 పరుగులకే ఆలౌట్ అయింది విండీస్.

రెండో ఇన్నింగ్‌లో నిలకడగా పాక్

పాకిస్తాన్ తన రెండో ఇన్నింగ్‌లో నిలకడగా ఆడింది. స్థిరత్వాన్ని ఎక్కడా కోల్పోలేదు. బ్యాట్స్‌మెన్లందరూ చెప్పుకోదగ్గ స్కోర్ సాధించారు. ఆరు వికెట్లను కోల్పోయి.. 176 పరుగులు చేసిన తరువాత మళ్లి ఇన్నింగ్‌ను డిక్లేర్ చేసింది పాకిస్తాన్. 328 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కాస్త గట్టిగా పోరాడితే.. చేతికి అందేంత టార్గెట్ అది. అయినప్పటికీ- వెస్టిండీస్ వీరులు.. తమ సొంత గడ్డ మీద కూడా ఈ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించలేకపోయారు. చేతులారా ఓటమి కొని తెచ్చుకున్నారు.

రెండో ఇన్నింగ్‌లో నాలుగు వికెట్లు..

రెండో ఇన్నింగ్‌లో నాలుగు వికెట్లు..

రెండో ఇన్నింగ్‌లో కూడా షహీన్ షా అఫ్రిది తన విజృంభణను కొనసాగించాడు. ఈ సారి నాలుగు వికెట్లను పడగొట్టాడు. తొలి, రెండో ఇన్నింగులతో కలిపి మొత్తం 10 వికెట్లను పడగొట్టాడతను. నౌమన్ అలీ, హసన్ అలీ తమవంతు పాత్ర పోషించారు.. విండీస్ ఓటమిని శాసించారు. నౌమన్ అలీ-3, హసన్ అలీ- రెండు వికెట్లు తీసుకున్నారు. మొత్తం 10 వికెట్లతో షహీన్ అఫ్రిది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ విజయంతో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను పాకిస్తాన్ సమం చేసుకుంది. విజయంతో తన వెస్టిండీస్ పర్యటనను ముగించుకుంది బాబర్ ఆజమ్ టీమ్.

Story first published: Wednesday, August 25, 2021, 9:24 [IST]
Other articles published on Aug 25, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+