WI vs PAK 2nd T20: పూరన్ చెలరేగినా..: చివరి ఓవర్‌లో 20 పరుగులు చేయాల్సిన దశలో

సెయింట్ జాన్స్: పాకిస్తాన్‌తో సిరీస్‌ను వెస్టిండీస్ జట్టు.. ఓటమితో ప్రారంభించింది. రెండో టీ20లో పరాజయాన్ని చవి చూసింది. గెలుపు వాకిట్లో బోల్తా కొట్టింది. ఆస్ట్రేలియాపై కనపరిచిన తెగువ, దూకుడును పాకిస్తాన్‌పై కొనసాగించలేకపోయారు విండీస్ వీరులు. బౌలింగ్‌లో సత్తా చాటినప్పటికీ- బ్యాటింగ్‌లో అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ నికొలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి ఆడినా.. చివరి వరకూ క్రీజ్‌లో ఉన్నా.. జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు.

లక్ష్యం చిన్నదే..

లక్ష్యం చిన్నదే..

ప్రావిడెన్స్‌లో జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ ఏడు పరుగుల తేడాతో ఓడిపోయింది. పాకిస్తాన్ నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. చేతిలో వికెట్లు ఉన్నప్పటికీ- రన్‌రేట్‌కు అనుగుణంగా బ్యాటింగ్ చేయలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఓపెనర్లు షర్జిల్ ఖాన్-మహ్మద్ రిజ్వాన్ శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్ భాగస్వామ్యానికి 4.4 ఓవర్లలోనే 46 పరుగులు చేశారు.

బ్యాటింగ్ ఘోరం..

బ్యాటింగ్ ఘోరం..

షర్జిల్ ఖాన్ 16 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 20, మహ్మద్ రిజ్వాన్ 36 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 46 పరుగులు చేశారు. ఎప్పట్లాగే వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ బాబర్ ఆజమ్ తనదైన శైలిలో దూకుడుగా ఆడాడు. హాప్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 40 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. ఆ తరువాతి బ్యాట్స్‌మన్లు ఎవ్వరూ క్రీజ్‌లో నిలదొక్కుకోలేకపోయారు. ఒకదశలో భారీ స్కోర్ చేసేలా కనిపించింది పాకిస్తాన్ బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్. అనూహ్యంగా కుప్పకూలింది. 12 పరుగుల తేడాతో చివరి నాలుగు వికెట్లను కోల్పోయింది.

జేసన్ హోల్డర్.. నాలుగు వికెట్లు..

జేసన్ హోల్డర్.. నాలుగు వికెట్లు..

టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఫకర్ జమాన్ సహా ఎవ్వరూ విండీస్ బౌలింగ్‌ను ప్రతిఘటించలేకపోయారు. ఒకదశలో 16.1 ఓవర్లలో 134 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయిన పాకిస్తాన్ జట్టు.. 20 ఓవర్లలో 157 పరుగులకు ఎనిమిది వికెట్లను నష్టపోయింది. ఫకర్ జమాన్-15 చేయగా..మహ్మద్ హఫీజ్, హసన్ అలీ, షోయబ్ మక్సూద్, షాదాబ్ ఖాన్ సింగిల్ డిజిట్‌ను కూడా అందుకోలేకపోయారు. వెస్టిండీస్‌లో ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్ తన ప్రతాపం చూపాడు.

గేల్ మళ్లీ

గేల్ మళ్లీ

నాలుగు ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి.. నాలుగు వికెట్లను పడగొట్టాడు. డ్వేన్ బ్రావో రెండు వికెట్లు తీసుకున్నాడు. మహ్మద్ రిజ్వాన్, షాదబ్ ఖాన్ రనౌట్ అయ్యారు. 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు బ్యాటింగ్ పరిస్థితి కూడా పాకిస్తాన్ కంటే భిన్నంగా ఏమీ లేదు. ఓపెనర్లు శుభారంభాన్ని ఇవ్వలేకపోయారు. తొలి ఓవర్ రెండో బంతికే వికెట్‌ను కోల్పోయింది విండీస్. ఆండ్రీ ఫ్లెచర్ డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ ఇవాన్ లెవిస్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. వన్ డౌన్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ క్రీజ్‌లో నిలదొక్కుకోలేకపోయాడు.

టాప్ స్పీడ్‌లో పూరన్

టాప్ స్పీడ్‌లో పూరన్

20 బంతుల్లో ఒక సిక్స్‌తో 16 పరుగులు చేసిన క్రిస్ గేల్‌ను హసన్ అలీ బలి తీసుకున్నాడు. హసన్ అలీ సంధించిన బంతిని మిడాన్ మీదుగా భారీ షాట్ కొట్టడానికి ప్రయత్నించాడు. అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి బెయిల్స్ ఎగురగొట్టింది. షిమ్రోన్ హెట్మెయిర్ మరోసారి విఫలమయ్యాడు. 18 బంతుల్లో ఒక ఫోర్‌తో 17 పరుగులు చేసి, మహ్మద్ వసీం బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్రీజ్‌లోకి వచ్చిన నికొలస్ పూరన్.. విండీస్ స్కోర్ బోర్డు గేర్ మార్చాడు. టాప్ స్పీడ్‌లో పరుగులెత్తించాడు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు.

పొల్లార్డ్ ఫెయిల్..

పొల్లార్డ్ ఫెయిల్..

అప్పటిదాకా నిస్సారంగా సాగుతున్నట్టు కనిపించిన మ్యాచ్‌లో మెరుపులు మెరిపించాడు. 33 బంతుల్లో ఆరు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 62 పరుగులు చేశాడు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో అతనికి సహకారాన్ని అందించే బ్యాట్స్‌మెన్ లేకపోవడంతో ఓటమి కోరల్లో నుంచి బయట పడలేకపోయారు కరేబియన్లు. పొల్లార్డ్ కూడా తన వైఫల్యాలను కొనసాగిస్తూనే వస్తోన్నాడు.

చివరి ఓవర్‌లో 20 పరుగులు చేయాల్సిన దశలో పొల్లార్డ్ అవుట్ అయ్యాడు. మూడు బంతుల్లో 18 పరుగులు చేయాల్సిన దశలో చివరి రెండు బంతుల్లో 10 పరుగులు సాధించాడు. పూరన్. ఓటమి అంతర్యాన్ని తగ్గించ గలిగాడే గానీ గెలుపును అందించలేకపోయాడు. పాకిస్తాన్‌లో మహ్మద్ హఫీజ్, షహీన్ అఫ్రిదీ, హసన్ అలీ, మహ్మద్ వసీం ఒక్కో వికెట్ తీసుకున్నారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, August 1, 2021, 7:49 [IST]
Other articles published on Aug 1, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X