ఒరేయ్ ఆజామూ లగెత్తరోయ్.. కెప్టెన్‌గా మారినా ఆట మాత్రం మారదు!
WI vs PAK: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసేసరికి పాకిస్థాన్ 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన బాబర్ ఆజం 23 పరుగులకు ఔటవ్వగా.. షాన్ మసూద్ 88 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దాదాపు మూడేళ్ల విరామం అనంతరం టెస్ట్ క్రికెట్లో పాక్ కెప్టెన్‌గా తిరిగొచ్చిన బాబర్ ఆజం.. బ్యాటింగ్‌లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టు రెండో రోజు ఆటలో బాబర్ ఆజం కేవలం 23 పరుగులకే ఔటయ్యాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 48 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసి.. ఆతిథ్య జట్టు కంటే ఇంకా 112 పరుగుల వెనుకబడి ఉంది.
జులై 2023 తర్వాత తొలిసారిగా టెస్ట్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన బాబర్ ఆజం క్రీజులో మంచి ఫామ్ లో కనిపించాడు. బాబర్ ఆజం తన 38 బంతుల ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు కొట్టాడు. కానీ వెస్టిండీస్ పేసర్ జేడెన్ సీల్స్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. బాబర్ ఆజం తన చివరి టెస్ట్ సెంచరీని దాదాపు నాలుగేళ్ల క్రితం కరాచీలో న్యూజిలాండ్‌పై సాధించాడు. బాబర్ ఆజం ఇప్పటివరకు 63 టెస్ట్ మ్యాచ్‌లలో 42.49 సగటుతో 4504 పరుగులు సాధించాడు, ఇందులో తొమ్మిది సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

రాణించిన షాన్ మసూద్, ఇమామ్ ఉల్ హక్
కెమర్ రోచ్ బౌలింగ్‌లో ఓపెనర్ అజాన్ ఒవైస్ డకౌట్ అవ్వడంతో పాకిస్థాన్‌కు పేలవమైన ఆరంభం లభించింది. ఆ తర్వాత మాజీ కెప్టెన్ షాన్ మసూద్, ఇమామ్-ఉల్-హక్(63) రెండో వికెట్‌కు అద్భుతమైన 155 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. షాన్ మసూద్ 137 బంతుల్లో 11 ఫోర్లతో 88 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా.. అప్పుడే క్రీజులోకి వచ్చిన ఆల్‌రౌండర్ సల్మాన్ అఘా ఇంకా తన ఖాతా తెరవలేదు.
తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 311 పరుగులకే ఆలౌట్
అంతకుముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ 311 పరుగుల వద్ద ముగిసింది. వికెట్ కీపర్ షాయ్ హోప్ (92 పరుగులు), కావెమ్ హాడ్జ్ (84 పరుగులు) జట్టును బలమైన స్కోరుకు చేర్చారు. పాకిస్థాన్ తరఫున ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అలీ అద్భుతంగా బౌలింగ్ చేసి 50 పరుగులకు 4 వికెట్లు తీయగా.. మహమ్మద్ అబ్బాస్ 63 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

