Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ ఐపీఎల్ బ్యాటింగ్ వీరులకు లక్కీ ఛాన్స్: జాతీయ జట్టులో చోటు: కేకేఆర్ మాజీ ప్లేయర్‌కూ స్థానం

 WI vs NZ: West Indies name Test and T20I squads for Tour of New Zealand

సెయింట్ జాన్స్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా రసవత్తరంగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ 13వ ఎడిషన్‌లో మెరుపులు మెరిపిస్తోన్న వెస్టిండీస్ బ్యాటింగ్ వీరులకు జాతీయ జట్టులో స్థానం లభించింది. న్యూజీలాండ్ పర్యటనకు బయలుదేరి వెళ్లబోయే వెస్టిండీస్ క్రికెట్ జట్టులో వారికి చోటు దక్కింది. ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ సారథ్యంలో న్యూజీలాండ్‌ పర్యటనకు వెళ్లే విండీస్ జట్టులో నికొలస్ పూరన్, ఫాస్ట్ బౌలర్ షెల్డన్ కాట్రెల్ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. షిమ్రోన్ హిట్మెయిర్ తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు.

వారిద్దరితో పాటు మరో ఆల్‌రౌండర్ డారెన్ బ్రావోకు కూడా బెర్త్ లభించింది. డారెన్ బ్రావో ఐపీఎల్ ఆడిన అనుభవం ఉంది. ఇదివరకు అతను కోల్‌కత నైట్ రైడర్స్‌ తరఫున ఐపీఎల్ మ్యాచ్‌లను ఆడాడు. నికొలస్ పూరన్ ప్రస్తుతం కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ టీమ్‌లో కొనసాగుతోన్న విషయం తెలిసిందే. పంజాబ్ బ్యాటింగ్ విభాగానికి అతను బ్యాక్‌బోన్‌గా ఉంటున్నాడు. కీలక సమయాల్లో ధాటిగా ఆడుతున్నాడు. జట్టుకు భారీ స్కోర్‌ను సాధించిపెడుతున్నాడు. 10 మ్యాచుల్లో 295 పరుగులు చేశాడు.

ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 77. రెండుసార్లు నాటౌట్‌గా నిలిచాడు. అతని బ్యాటింగ్ స్ట్రైక్ రేటు 183.22. ఢిల్లీ కేపిటల్స్ తరఫున ఆడుతోన్న షిమ్రోన్ హిట్మెయిర్ విండీస్ టీ20 జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. హెట్మెయిర్.. టీ20, టెస్ట్ జట్లల్లో స్థానం దక్కించుకున్నాడు. ఢిల్లీ కేపిటల్స్‌ జట్టులో సభ్యుడిగా ఉన్న మరో విండీస్ బ్యాట్స్‌మెన్ కీమో పాల్‌ను కూడా న్యూజీలాండ్ పర్యటనకు ఎంపిక చేసింది విండీస్ క్రికెట్ బోర్డు. ఈ ఐపీఎల్ సీజన్‌లో కీమో పాల్‌కు ఇంకా మ్యాచ్‌లను ఆడే అవకాశం రాలేదు. న్యూజీలాండ్ పర్యటనలో వారు ఏ స్థాయిలో రాణిస్తారనేది ఆసక్తిగా మారింది.

విండీస్ టెస్ట్ టీమ్: జేసన్ హోల్డర్ (కేప్టెన్), జెర్మయిన్ బ్లాక్‌వుడ్, క్రెగ్ బ్రేత్‌వైట్, డారెన్ బ్రావో, షమర బ్రూక్స్, జాన్ క్యాంప్‌బెల్, రోస్టన్ ఛేజ్, కార్న్‌వెల్, షేన్ డౌరిచ్, షన్నన్ గాబ్రియెల్, షిమ్రోన్ హిట్మెయిర్, చెమర్ హోల్డర్, అల్జర్రీ జోసెఫ్, కీమో పాల్, కీమర్ రోచ్. రిజర్వ్ ఆటగాళ్లు- బొన్నర్, జోషువా డిసిల్వా, ప్రెస్టన్ మెక్‌స్వీన్, షెయిన్ మోస్లె, రీఫర్, జెడెన్ సీల్స్.

టీ20 స్క్వాడ్: కీరన్ పొలార్డ్ (కేప్టెన్), ఫాబియన్ అల్లెన్, రొమారియో షెప్పర్డ్, షెల్డన్ కాట్రెల్, ఆంఢ్రీ ఫ్లెచ్చర్, షిమ్రోన్ హిట్మెయిర్, బ్రెండన్ కింగ్, కైలే మాయెర్స్, రోవ్‌మన్ పావెల్, కీమో పాల్, నికొలస్ పూరన్, ఒషనె థామస్, హెడెన్ వాల్ష్ జూనియర్, కెస్రిక్ విలియమ్స్.

Story first published: Thursday, October 22, 2020, 10:35 [IST]
Other articles published on Oct 22, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+