For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20WC: అతనే మా కొంపముంచాడు- విలియమ్సన్

సూపర్-8 అవకాశాలు మెరుగుపర్చుకోవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓటమిపాలైంది. తదుపరి దశకు చేరే అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. ట్రిండాడ్ వేదికగా గురువారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో కివీస్ 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మొదట విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్ (68 నాటౌట్; 39 బంతుల్లో, 2 ఫోర్లు, 6 సిక్సర్లు) అజేయ అర్థశతకంతో చెలరేగాడు. బౌల్ట్ (3/16) మూడు, సౌథి (2/21), ఫెర్గూసన్ (2/27) చెరో రెండు వికెట్లతో సత్తాచాటారు.

అయితే టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన వెస్టిండీస్ 30 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన రూథర్‌ఫర్డ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఆఖరి వరకు క్రీజులో నిలిచి సవాలైన లక్ష్యాన్ని కివీస్ ముందు ఉంచాడు. అనంతరం ఛేదనలో న్యూజిలాండ్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 136 పరుగులే చేసింది.గ్లెన్ ఫిలిప్స్ (40; 33 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. మిచెల్ శాంట్నర్ (21 నాటౌట్; 12 బంతుల్లో, 3 సిక్సర్లు) పోరాడాడు. అల్జారీ జోసెఫ్ (4/19), మొటియి (3/25) సత్తాచాటారు.

WI vs NZ The quality of Sherfane s innings was the difference- Kane Williamson

కాగా, మ్యాచ్ అనంతరం కేన్ విలియమ్సన్ తమ జట్టు ప్రదర్శన, ఓటమి గల కారణాలు వివరించాడు. రూథర్‌ఫర్డ్ అద్భుత ప్రదర్శన తమ ఓటమికి ప్రధాన కారణమని అన్నాడు. పవర్‌ప్లేలో తమ బౌలర్లు 23 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్ల తీయడంపై మాట్లాడుతూ.. ''పవర్‌ప్లే బాగుంది. సరైన ప్రదేశాల్లో బంతుల్ని సంధిస్తే మంచి ఫలితం వస్తుందని ఆశించాం. అదే జరిగింది. ఇలాంటి పిచ్‌లపై ఒక ఓవర్ లేదా రెండు ఓవర్లు మ్యాచ్‌ను తారుమారు చేస్తాయి''

''రూథర్‌ఫర్డ్ గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. లోతైన బ్యాటింగ్ ఆర్డర్ ఉండటం వెస్టిండీస్‌కు కలిసొచ్చింది. వికెట్లను సాధించడానికి మేం దూకుడైన తీరును అవలంబించాం. ఈ క్రమంలో కఠిన ఓవర్లు ఎదుర్కోవాల్సి వస్తుందని ఊహించాం'' అని విలియమ్సన్ అన్నాడు. శాంట్నర్‌తో ఆఖరి ఓవర్ వేయించిన కివీస్ వ్యూహం దారుణంగా విఫలమైంది. ఎడమచేతి వాటం స్పిన్నర్ శాంట్నర్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాది రూథర్‌ఫర్డ్ 18 పరుగులు పిండుకున్నాడు.

దీని గురించి స్పందిస్తూ.. ''మా వ్యూహంపై పూర్తి నమ్మకంతో ఉన్నాం. శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. కానీ ఇక్కడ రెండు మూడు బంతులతో ఫలితం మారుతోంది. ఇక్కడ పరిస్థితులకు తగ్గట్టుగా ఆడాలి. మేం సాకులు చెప్పాలనుకోవట్లేదు. తిరిగి గొప్పగా పుంజుకోవాలనుకుంటున్నాం. తర్వాత జరగనున్న మ్యాచ్‌లో స్మార్ట్‌గా ఆడాలని భావిస్తున్నాం'' అని కేన్ విలియమ్సన్ అన్నాడు. భారత కాలమాన ప్రకారం జూన్ 15న ఉగాండతో, జూన్ 17న పపువా న్యూ గినియాతో న్యూజిలాండ్ తలపడనుంది.

Story first published: Thursday, June 13, 2024, 11:28 [IST]
Other articles published on Jun 13, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+