WI vs BAN: బంగ్లాదేశ్‌ను మట్టికరిపించిన వెస్టిండీస్.. రికార్డు ఛేజింగ్‌తో క్లీన్‌స్వీప్!
సెయింట్ కిట్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఆఖరి వన్డేలో వెస్టిండీస్ నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. 2014 తర్వాత బంగ్లాదేశ్‌పై వన్డే సిరీస్ గెలిచిన విండీస్.. మూడో వన్డేలో రికార్డు ఛేజింగ్ చేసింది. సెయింట్స్ కిట్స్ వేదికలో ఇదే అత్యుత్తమ ఛేదన. అంతేగాక వన్డే ఫార్మాట్‌లో వెస్టిండీస్ ఇదే అత్యుత్తమ మూడో ఛేదన. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు విండీస్ వరుసగా 11 వన్డేలు ఓడిపోవడం గమనార్హం.
మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో అయిదు వికెట్లకు 321 పరుగులు చేసింది. మహ్మదుల్లా (84 నాటౌట్; 63 బంతుల్లో, 7 ఫోర్లు, 4 సిక్సర్లు), కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్ (77; 73 బంతుల్లో, 8 ఫోర్లు, 2 సిక్సర్లు), సౌమ్య సర్కార్ (73; 73 బంతుల్లో, 6 ఫోర్లు, 4 సిక్సర్లు), జేకర్ అలీ (62 నాటౌట్; 57 బంతుల్లో, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకాలతో సత్తాచాటారు. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లు, మొటియ్, రూథర్‌ఫర్డ్ తలో వికెట్ తీశారు.

అయితే బంగ్లాదేశ్ 9 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. కానీ సౌమ్య సర్కార్- మెహదీ హసన్ మూడో వికెట్‌కు 136 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. ఇక ఆఖర్లో ఆరో వికెట్‌కు మహ్మదుల్లా-జేకర్ అలీ అభేద్యంగా 150 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదుచేశారు. అనంతరం ఛేదనకు దిగిన వెస్టిండీస్ 45.5 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది.
SIgned, Sealed & delivered.🔥
— Windies Cricket (@windiescricket) December 12, 2024
Motie seals the 3-0 series win with a six!#WIvBAN | #WIHomeForChristmas pic.twitter.com/cXIPZchySs
అరంగేట్ర ప్లేయర్లు అమీర్ జాంగూ (104 నాటౌట్; 83 బంతుల్లో, 6 ఫోర్లు, 4 సిక్సర్లు), కీసీ కార్టీ (95; 88 బంతుల్లో, 10 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసం సృష్టించారు. మొటియ్ (44 నాటౌట్; 31 బంతుల్లో, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే వెస్టిండీస్ ఛేదన అంత సాఫీగా సాగలేదు. 31 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. కానీ కీసీ కార్టీ అద్భుత ప్రదర్శనతో ఇన్నింగ్స్ నిర్మించాడు. అతను ఔటైన అనంతరం అమీర్ బాదే బాధ్యతను అందుకుని జట్టుకు విజయాన్ని అందించాడు. బంగ్లా బౌలర్లలో రిషద్ హొస్సేన్ రెండు, తస్కిన్ అహ్మద్, నాసుమ్, హసన్ తలో వికెట్ తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications